Pooja Hegde: ఆ హీరోతో పూజా హెగ్డే ఎఫైర్..బయటపడ్డ వీడియో

Pooja Hegde: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Update: 2026-05-14 04:56 GMT

Pooja Hegde: ఆ హీరోతో పూజా హెగ్డే ఎఫైర్..బయటపడ్డ వీడియో

Pooja Hegde and Rohan Mehra: టాలీవుడ్ కుర్రకారు గుండెల్లో బుట్టబొమ్మగా గూడు కట్టుకున్న పూజా హెగ్డే ఇప్పుడు వెండితెరపైనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ వార్తల్లో నిలుస్తోంది. గత కొంతకాలంగా ఈ పొడుగుకాళ్ల సుందరి ప్రేమాయణం గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. తాజాగా ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ పూజ ఒక బాలీవుడ్ కుర్ర హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

మనసు గెలుచుకున్న బాలీవుడ్ హీరో!

పూజా హెగ్డే మనసు దోచుకున్న ఆ అదృష్టవంతుడు మరెవరో కాదు.. బాలీవుడ్ దివంగత నటుడు వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ మెహ్రా. 2018లో సైఫ్ అలీ ఖాన్ నటించిన 'బజార్' సినిమాతో రోహన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. గత కొంతకాలంగా ముంబైలోని ప్రముఖ రెస్టారెంట్లు, సినీ పార్టీల్లో ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కెమెరాలకు చిక్కుతున్నారు. ముఖ్యంగా పూజ తన తల్లిదండ్రులతో కలిసి డిన్నర్ వేడుకలకు వెళ్లినప్పుడు కూడా రోహన్ అక్కడే ఉండటం చూస్తుంటే, వీరి బంధం కేవలం స్నేహానికే పరిమితం కాదని, పెద్దల అంగీకారంతో పెళ్లి దిశగా అడుగులు వేస్తున్నారని అభిమానులు భావిస్తున్నారు.

పరిచయం ఎలా జరిగింది?

విశేషమేమిటంటే, పూజా హెగ్డే , రోహన్ మెహ్రా కలిసి ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు. మరి వీరి మధ్య స్నేహం ఎలా మొదలైంది అని ఆరా తీస్తే.. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. మొదట స్నేహంగా ప్రారంభమైన ఈ బంధం, త్వరలోనే ప్రేమగా మారిందని సమాచారం. గతంలో పూజ పుట్టినరోజున రోహన్ చేసిన స్పెషల్ ఇన్‌స్టా పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పూజ ఈ వార్తలను కేవలం స్నేహం అని కొట్టిపారేస్తున్నప్పటికీ, తాజాగా వీరిద్దరూ ఒకే కారులో కనిపిస్తుండటంతో వీరి రిలేషన్ దాదాపు కన్ఫర్మ్ అని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు.

వరుస సినిమాలతో బిజీ బిజీ..

ప్రేమ వ్యవహారాలు పక్కన పెడితే, పూజా హెగ్డే కెరీర్ ప్రస్తుతం టాప్ గేర్‌లో ఉంది. తెలుగులో కాస్త గ్యాప్ వచ్చినప్పటికీ, బాలీవుడ్, కోలీవుడ్‌లో భారీ ప్రాజెక్టులతో ఈ భామ బిజీగా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రం జూన్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళ సూపర్ స్టార్ విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ లో పూజ నటిస్తోంది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌తో కూడా ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేస్తోంది.

సోషల్ మీడియాలో ఈ జంట ఫోటోలు చూసిన నెటిజన్లు కుర్రాడు కత్తిలా ఉన్నాడు.. పూజాకు సరైన జోడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పూజ తన మనసులోని మాటను అధికారికంగా ఎప్పుడు బయటపెడుతుందోనని అక్కినేని , మెగా హీరోల సరసన నటించిన ఈ భామ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Tags:    

Similar News