Peddi Movie: పెద్ది’ సినిమాపై వివాదం మరింత వేడెక్కుతోంది!

Peddi Movie: ‘పెద్ది’ సినిమా వివాదంపై నిర్మాత నట్టి కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా విడుదలను అడ్డుకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.

Update: 2026-05-23 15:11 GMT

Peddi Movie: పెద్ది’ సినిమాపై వివాదం మరింత వేడెక్కుతోంది!

Peddi Movie: టాలీవుడ్‌లో ప్రస్తుతం పెద్ది సినిమా వివాదం హాట్ టాపిక్‌గా మారింది. సినిమా విడుదల నేపథ్యంలో వస్తున్న వివాదాలపై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు జరిగితే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ప్రాంతాల్లో ఎగ్జిబిటర్లకు ఎలాంటి సమస్యలు లేవని నట్టి కుమార్ స్పష్టం చేశారు. జూన్ 3న గ్రాండ్ ప్రీమియర్స్ నిర్వహించేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.

అయితే కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ సినిమాను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించిన ఆయన, “పెద్ది సినిమాను ఆపాలని ఎవరైనా ప్రయత్నిస్తే బుధవారం ఉదయం 10 గంటలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాను” అని ప్రకటించారు.

అలాగే చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేయడం లేదని కొందరు చెబుతున్నప్పటికీ, వాస్తవానికి ఎవరు ఈ వ్యవహారానికి కారణమో తమకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. ఇతర స్టార్ హీరోల సినిమాలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు స్పందించని వారు, ఇప్పుడు ఒక్క “పెద్ది” సినిమానే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని ప్రశ్నించారు.

మహేష్ బాబు, రవితేజ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ సినిమాలకు సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు ఎవరూ మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.

“మీ వెనకాల కొంతమంది ఆడిస్తున్నారు. ఆ నలుగురు ఆడిస్తున్న ఆటకు బలి కావద్దు. ఈ సినిమా హిట్ అయి థియేటర్లలో పండగ వాతావరణం రావాలని కోరుకుందాం. కానీ సినిమాను ఆపాలని అనుకోవడం చాలా తప్పు” అంటూ నట్టి కుమార్ తీవ్రంగా స్పందించారు.

ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా వివాదం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది!

Tags:    

Similar News