Peddi : 'పెద్ది' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. టాక్ ఎలా ఉందంటే..?

Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ఫస్ట్ రివ్యూ వైరల్.

Update: 2026-06-03 05:05 GMT

Peddi : 'పెద్ది' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. టాక్ ఎలా ఉందంటే..?

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్లోబల్ స్టార్ చరిష్మా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సనా మేకింగ్ కలగలిసి వస్తున్న చిత్రం 'పెద్ది'. జూన్ 4వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాపై దుబాయ్ సెన్సార్ బోర్డ్ నుంచి తొలి రివ్యూ వచ్చేసింది.

దుబాయ్ టాక్..

ప్రముఖ ఫిలిం క్రిటిక్ ఉమేర్ సంధూ తన సోషల్ మీడియా వేదికగా 'పెద్ది' మూవీ ఫస్ట్ రివ్యూను షేర్ చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. ఈ సినిమా ప్రేక్షకులకు "పైసా వసూల్" మూవీ. రామ్ చరణ్ తన నటనతో మరోసారి ప్రేక్షకులను మాయ చేస్తారని, ఈ సినిమాతో ఆయన సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తారని ఉమేర్ సంధూ పేర్కొన్నారు. ఇది కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్ అని ఆయన తేల్చి చెప్పారు.

క్లైమాక్సే ప్రాణం..

సాంకేతిక విభాగాల పరంగా 'పెద్ది' మూవీ హై లెవల్లో ఉందని రివ్యూలో వెల్లడించారు.ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్‌గా ఉండటమే కాకుండా సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లిందట. ఈ చిత్రానికి క్లైమాక్స్ అతిపెద్ద బలం అని, ఆడియన్స్‌ను ఇది కట్టిపడేస్తుందని ఆయన తెలిపారు. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే వంటి హేమాహేమీలు ఉండటంతో సినిమా వెయిట్ పెరిగిందని, ప్రతి పాత్ర పర్‌ఫెక్ట్‌గా సెట్ అయిందని పేర్కొన్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్ గ్లామర్ షో ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని, అయితే ఆమె నటన కంటే గ్లామర్‌కే ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉందని కామెంట్ చేశారు.

కొంత నిరాశే..

సినిమాలో స్క్రీన్ ప్లే కొంత రొటీన్‌గా, రెగ్యులర్‌గా అనిపించవచ్చని, అది ఫ్యాన్స్‌కు స్వల్ప నిరాశ కలిగించే విషయమని ఉమేర్ సంధూ తన రివ్యూలో పేర్కొన్నారు. అయినప్పటికీ, రామ్ చరణ్ వన్ మ్యాన్ షో కారణంగా సినిమా ఎంగేజింగ్‌గా సాగిపోతుందని ఆయన తెలిపారు.

ఫ్యాన్స్‌లో జోష్

నిజానికి ఉమేర్ సంధూ ఇచ్చే రివ్యూలు కొన్నిసార్లు నిజమైతే, మరికొన్ని సార్లు అంచనాలు తలకిందులు అవుతుంటాయి. గతంలో ఆయన 'బ్లాక్ బస్టర్' అన్న సినిమాలు డిజాస్టర్ అవ్వడం, 'ఫ్లాప్' అన్నవి హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఏదేమైనా, సినిమా రిలీజ్ కావడానికి ముందే పైసా వసూల్ అనే టాక్ రావడంతో మెగా అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. జూన్ 4వ తేదీన 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.





 


Tags:    

Similar News