OG 2: ఓజీ 2 సంచలనం పవన్ కల్యాణ్ - సుజీత్ క్రేజీ డిస్కషన్ వీడియో వైరల్!
OG 2: 'ఓజీ' (They Call Him OG) కేవలం అభిమానులకే కాదు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కూడా అత్యంత ప్రత్యేకమైన ప్రాజెక్ట్.
OG 2: ఓజీ 2 సంచలనం పవన్ కల్యాణ్ - సుజీత్ క్రేజీ డిస్కషన్ వీడియో వైరల్!
OG 2: 'ఓజీ' (They Call Him OG) కేవలం అభిమానులకే కాదు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కూడా అత్యంత ప్రత్యేకమైన ప్రాజెక్ట్. హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, కటానా కత్తులు, తుపాకులతో పవన్ చేసిన విన్యాసాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. తన అద్భుతమైన స్వాగ్ , స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆయన అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ఇప్పుడు 'ఓజీ యూనివర్స్' అధికారికంగా ప్రకటించడంతో, ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన తాజా వీడియో నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది.
దర్శకుడు సుజీత్‌తో పవన్ కల్యాణ్ జరిపిన మొదటి క్రియేటివ్ డిస్కషన్ వీడియోలో, సినిమాకు సంబంధించి రెండు అత్యంత ఆసక్తికరమైన అంశాలను సుజీత్ వెల్లడించారు. సినిమా ప్రారంభంలో మంచు కురుస్తున్న దృశ్యం నెమ్మదిగా రక్తవర్ణంలోకి (బ్లడ్ రెడ్) మారి, ఆ తర్వాత 'ఓజా గంభీర' (Ojas Gambheera) అనే పేరు డిస్‌ప్లే అవుతుంది. ఈ ఇంటెన్స్ అండ్ స్టైలిష్ ఓపెనింగ్ సీన్ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లనుంది. అలాగే, ఈ చిత్రంలో కథానాయకుడికి ఒక పెంపుడు జంతువు తోడుగా ఉండనుంది, ఇది ఓజీ పాత్రకు ఒక సరికొత్త కోణాన్ని జోడిస్తుంది.
వీడియోలో 'ఓజీ: ది ఫస్ట్ బ్లడ్' (OG: The First Blood) కామిక్ బుక్ పేజీలను కూడా చూపించారు. ఇందులో సుభాష్ చంద్రబోస్‌తో ఓజీ పాత్రకున్న అనుబంధం , ఇప్పటి వరకు ఎవరూ ఊహించని అనేక రహస్యాలు, నేపథ్య కథలను ఈ యూనివర్స్‌లో భాగం చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. సుజీత్ చెప్తున్న విషయాలను పవన్ కల్యాణ్ ఎంతో ఉత్సాహంగా వింటుండటం, ఈ ప్రాజెక్టుపై ఆయనకున్న ఆసక్తిని తెలియజేస్తోంది.
అంతా అనుకున్నట్లు జరిగితే, అభిమానులు ఊహించిన దానికంటే ముందే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. పవన్ కల్యాణ్, సుజీత్ , మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మళ్ళీ ఒకే తాటిపైకి రావడంతో, మరో పవర్‌ఫుల్ అండ్ స్టైలిష్ సినిమా చూడబోతున్నామని అభిమానులు ముందే సంబరపడిపోతున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.