Jr NTR: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ: నిజమెంత? పుకార్లెంత?

Jr NTR: అగ్రకథానాయకుడు ఎన్టీఆర్ జులై 18న రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఎన్టీఆర్ అభిమానుల సంఘం అధికారికంగా తెరదించింది.

Update: 2026-07-13 09:12 GMT

Jr NTR: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ: నిజమెంత? పుకార్లెంత?

Jr NTR: అగ్రకథానాయకుడు ఎన్టీఆర్ జులై 18న రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఎన్టీఆర్ అభిమానుల సంఘం అధికారికంగా తెరదించింది. ఆ రోజు జరగబోయే కార్యక్రమంతో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

అసలు ఆ కార్యక్రమం ఏంటి?

జులై 18న ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో 'ఊరు-వాడ' అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. అయితే, దీనిని కొందరు తప్పుగా అర్థం చేసుకుని తారక్ పొలిటికల్ ఎంట్రీతో ముడిపెడుతున్నారు. దీనిపై స్పందించిన సంఘం ప్రతినిధులు, "ఇది పూర్తిగా ఒక సామాజిక కార్యక్రమం మాత్రమే. దీని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. దయచేసి అసత్య ప్రచారాలను నమ్మవద్దు" అని లేఖ ద్వారా కోరారు. ఇటువంటి పుకార్ల వల్ల అభిమానులు అయోమయానికి గురవుతున్నారని, మీడియా సంస్థలు ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

ఇతర స్టార్ హీరోల రాజకీయ ప్రయాణంపై చర్చ..

తమిళ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన నేపథ్యంలో, టాలీవుడ్‌లో కూడా హీరోల ఎంట్రీపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇటీవల అల్లు అర్జున్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారని, అందుకు సంబంధించిన వ్యూహాల కోసం ఆయన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను కలిశారనే వార్తలు సినీ వర్గాల్లో కలకలం రేపాయి. అయితే, దీనిపై అల్లు అర్జున్ కానీ, ఆయన బృందం కానీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

ప్రస్తుతానికి ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనని తేలిపోవడంతో, అభిమానులు తారక్ తదుపరి సినిమాలపై దృష్టి పెడుతున్నారు. అయితే, ఈ వార్తలపై ఎన్టీఆర్ స్వయంగా ఎప్పుడు స్పందిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News