Balakrishna: బాలయ్యకు మళ్లీ టెంపర్ లేచింది.. ఇచ్చి పడేశాడు అంతే
Balakrishna: నందమూరి బాలకృష్ణ బర్త్‌డే వేడుకల్లో భాగంగా హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది.
Balakrishna: బాలయ్యకు మళ్లీ టెంపర్ లేచింది.. ఇచ్చి పడేశాడు అంతే
Nandamuri Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వింటేనే ఒక వైబ్రేషన్! ఓవైపు సిల్వర్ స్క్రీన్‌పై వరుస హిట్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ, మరోవైపు రాజకీయాల్లో హిందూపురం నుండి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని లీడర్‌గా దూసుకుపోతున్నారు బాలయ్య. అయితే, బాలయ్య బాబు గురించి ఇండస్ట్రీలో ఒక మాట గట్టిగా వినిపిస్తూ ఉంటుంది.. ఆయనకు క్షణాల్లో కోపం వస్తుంది, అంతే క్షణాల్లో శాంతం కూడా వచ్చేస్తుంది. తాజాగా ఆయన పుట్టినరోజు వేడుకల సందర్భంగా సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇటీవలే నందమూరి బాలకృష్ణ బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌లో అభిమానుల కోసం ప్రత్యేకంగా ఫోటో సెషన్ ఏర్పాటు చేశారు. తమ అభిమాన హీరోను గుండెల్లో పెట్టుకునే ఫ్యాన్స్.. ఆయనతో ఒక్క ఫోటో దిగితే చాలు జీవితం ధన్యమైపోతుంది అనుకుంటూ భారీ సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు.
అయితే, బాలయ్యను చూడగానే అభిమానుల ఉత్సాహం హద్దులు దాటింది. ఫోటోలు దిగే క్రమంలో కొంతమంది ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆయనపైకి ఎగబడ్డారు. తోపులాట జరగడంతో బాలయ్య బాబు ఒక్కసారిగా అసహనానికి లోనయ్యారు. తనదైన మాస్ స్టైల్‌లో.. వెనక్కి వెళ్ళండి అంటూ అభిమానులపై కాస్త గట్టిగానే సీరియస్ అయ్యారు.
ఎప్పుడైతే బాలయ్యకు కోపం వచ్చిందో.. అక్కడ ఉన్న అభిమానులంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. డిసిప్లిన్‌కు మారుపేరైన నందమూరి ఫ్యాన్స్.. వెంటనే గొడవ ఆపేసి, ఎవరికి వారు క్రమశిక్షణతో ఒకే వైపునకు వచ్చి పద్ధతిగా లైన్ లో నిలబడిపోయారు. అభిమానుల ఆ డిసిప్లిన్ చూసి థియేటర్లలో విలన్లను చీల్చిచెండాడే మన గాడ్ ఆఫ్ మాసెస్ మనసు కూడా కరిగిపోయింది.
క్షణంలో వచ్చిన కోపాన్ని అంతే వేగంగా పక్కన పెట్టేసి, శాంతించిన బాలకృష్ణ.. యథావిధిగా లైన్ లో నిలబడిన ప్రతి ఒక్క అభిమానితో ఎంతో ఓపికగా, నవ్వుతూ ఫోటోలు దిగారు. దాంతో అక్కడున్న వారంతా జై బాలయ్య.. జై జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. కోపమున్నా, ప్రేమున్నా అది ఒక్క బాలయ్య బాబుకే సాధ్యం అంటూ నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.