Kiara Advani: ప్లీజ్ నా అశ్లీల సీన్స్‌ను తొలగించండి.. ఆ హీరోను వేడుకున్న కియారా అద్వానీ
Kiara Advani: యష్ హీరోగా వస్తున్న టాక్సిక్‌పై కియారా అద్వానీ సంచలన నిర్ణయం.
Kiara Advani: ప్లీజ్ నా అశ్లీల సీన్స్‌ను తొలగించండి.. ఆ హీరోను వేడుకున్న కియారా అద్వానీ
Yash Toxic: కన్నడ రాకింగ్ స్టార్ యష్ KGF తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో టాక్సిక్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకున్న తరుణంలో ఒక సెన్సేషనల్ న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది.
బోల్డ్ సీన్లపై కియారా అభ్యంతరం?
తాజా సమాచారం ప్రకారం.. సినిమాలో తాను నటించిన కొన్ని బోల్డ్ , ఇంటిమేట్ సీన్లను తొలగించాలని లేదా ట్రిమ్ చేయాలని కియారా అద్వానీ దర్శకుడిని కోరినట్లు తెలుస్తోంది. హీరో యష్‌తో ఉన్న కొన్ని సన్నిహిత దృశ్యాలను స్క్రీన్ పైన చూసిన తర్వాత, ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఆమె స్వయంగా దర్శకురాలు గీతూ మోహన్ దాస్‌తో పాటు హీరో యష్‌ను సైతం సంప్రదించి తన ఆందోళనను వ్యక్తం చేసినట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
విమర్శల భయమే కారణమా?
ఇప్పటికే టాక్సిక్ టీజర్‌లో కనిపించిన కొన్ని ఘాటు దృశ్యాలపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కథలో భాగంగా అవి అవసరమే అయినప్పటికీ, ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రతికూల స్పందనను దృష్టిలో పెట్టుకుని కియారా ఈ మార్పులు కోరినట్లు టాక్. గ్లామర్ పాత్రలకు పెట్టింది పేరైన కియారా, ఈ సినిమాలో నటనకు ప్రాధాన్యమున్న పాత్ర చేస్తున్నప్పటికీ.. మరీ బోల్డ్ సీన్లు ఉంటే అది తన ఇమేజ్‌పై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారట.
దర్శకురాలి నిర్ణయం ఏమిటి?
గీతూ మోహన్ దాస్ తన సినిమాల్లో సహజత్వానికి పెద్దపీట వేస్తారు. మరి కియారా కోరిక మేరకు ఆ సీన్లకు కత్తెర వేస్తారా? లేక కథా గమనానికి అవి అవసరమని నచ్చజెబుతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆ దృశ్యాలను తొలగిస్తే సినిమా బరువు తగ్గుతుందా? లేక కియారా ఇమేజ్‌ను కాపాడుతుందా? అనేది వేచి చూడాలి.