Kavya Maran: ఐపీఎల్ రూల్ బ్రేక్.. కావ్య పాప ఎంత తెలివిగా సమాధానం చెప్పింది..!

Kavya Maran: ‘ది హండ్రెడ్ 2026’ లీగ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ తరఫున పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను తుది జట్టులోకి తీసుకోవడంపై సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్ క్లారిటీ.

Update: 2026-07-22 08:04 GMT

Kavya Maran: ఐపీఎల్ రూల్ బ్రేక్.. కావ్య పాప ఎంత తెలివిగా సమాధానం చెప్పింది..!

Sunrisers Leeds: ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వేదికగా జరుగుతున్న సరికొత్త లీగ్ ‘ది హండ్రెడ్ 2026’ జూలై 21 నుంచి ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 16 వరకు సాగనున్న ఈ ధనాధన్ టోర్నీలో మొత్తం 8 జట్లు విజయం కోసం పోరాడుతున్నాయి. అయితే ఈసారి లీగ్‌కు ప్రత్యేక ఆకర్షణ ఏమిటంటే... ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలు ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టడం. ముంబై ఇండియన్స్ ఎమ్‌ఐ లండన్‌గా, ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం సౌతర్న్ బ్రేవ్‌గా, లక్నో సూపర్‌జెయింట్స్ మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్‌గా, సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సన్‌రైజర్స్ లీడ్స్ పేరుతో ఈ టోర్నీలో భాగస్వామ్యాలు దక్కించుకున్నాయి.

2008 మొదటి ఐపీఎల్ సీజన్ తర్వాత ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా తమ గ్లోబల్ టీమ్స్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లను ప్రాతినిధ్యం వహించనీయలేదు. కానీ, ది హండ్రెడ్ ప్లేయర్స్ వేలంలో సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. వేలంలో పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ ను ఏకంగా సుమారు రూ.2.45 కోట్లు సన్‌రైజర్స్ లీడ్స్ సొంతం చేసుకుంది.

లీగ్ ప్రారంభమైన తొలి మ్యాచ్‌లోనే అబ్రార్ అహ్మద్‌ను తుది జట్టులోకి తీసుకోవడం ద్వారా సన్‌రైజర్స్ యాజమాన్యం క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు తెరలేపింది. పాకిస్థానీ క్రికెటర్‌ను జట్టులోకి తీసుకోవడంపై ఇంగ్లాండ్‌కు చెందిన ప్రసిద్ధ 'ది టెలిగ్రాఫ్' పత్రిక ప్రతినిధులు కావ్య మారన్‌ను ప్రశ్నించగా... ఆమె ఎంతో తెలివిగా, వివాదాలకు దూరంగా సమాధానమిచ్చారు.

కావ్య మారన్ మాటల్లో..మేము పురుషులు, మహిళల రెండు జట్ల కూర్పు పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాం. జట్టు ఎంపికలో ప్రదర్శన, అవసరాలతో పాటు ఎన్నో అంశాలను దృష్టిలో ఉంచుకొని సరైన బ్యాలెన్స్‌ను సాధించామని చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది. ఈ సీజన్ 'ది హండ్రెడ్' టోర్నీలో కేవలం ఇద్దరు పాకిస్థాన్ క్రికెటర్లకు మాత్రమే ఆడే అవకాశం లభించింది. అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్ వీరిద్దరే ఈ టోర్నిలో చోటు దక్కించుకున్నారు. భారతీయ ఐపీఎల్ యాజమాన్యాలు అడుగుపెట్టడంతో ఈసారి 'ది హండ్రెడ్ 2026' లీగ్ క్రికెట్ ప్రేమికుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.

Tags:    

Similar News