అఖిల్ 'లెనిన్'లో జూనియర్ ఎన్టీఆర్... ఆసక్తి రేకెత్తిస్తున్న కొత్త పోస్టర్!

Akhil Akkineni: అక్కినేని అఖిల్ కథానాయకుడిగా, మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా 'లెనిన్’ జులై 10, 2026న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. చిత్తూరు జిల్లా నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి

Update: 2026-07-06 10:36 GMT

అఖిల్ 'లెనిన్'లో జూనియర్ ఎన్టీఆర్... ఆసక్తి రేకెత్తిస్తున్న కొత్త పోస్టర్! 

లెనిన్: అక్కినేని అఖిల్ కథానాయకుడిగా, మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా 'లెనిన్’ జులై 10, 2026న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. చిత్తూరు జిల్లా నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన కొత్త పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఒక పులి , సినిమా టైటిల్ లోగోతో ఉన్న ఈ పోస్టర్ వెనుక పెద్ద రహస్యమే దాగి ఉందని అభిమానులు చర్చిస్తున్నారు.

'మాన్ ఆఫ్ మాసెస్' వాయిస్ ఓవర్

ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. ఈ చిత్రానికి 'మాన్ ఆఫ్ మాసెస్' జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. సినిమాలో కథను నడిపించే సూత్రధారిగా ఎన్టీఆర్ గొంతు వినిపించనుంది. పోస్టర్‌లోని 'పులి' ఎన్టీఆర్ పాత్రను , ఆయన గంభీరమైన వాయిస్‌ను సూచిస్తుందని చిత్రబృందం పరోక్షంగా స్పష్టం చేసింది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఈ పొలిటికల్ డ్రామాకు అదనపు ఆకర్షణగా నిలవనుంది.

చిత్ర విశేషాలు

చిత్తూరు జిల్లా రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ కథలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. శివాజీ, సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరీ రావు , ప్రమోద్ పంజు వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున , సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'మనం ఎంటర్‌ప్రైజెస్', 'సితార ఎంటర్‌టైన్‌మెంట్స్' , 'అన్నపూర్ణ స్టూడియోస్' బ్యానర్‌ల మీద ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది.

అఖిల్ కెరీర్‌లోనే ఒక భిన్నమైన , పవర్‌ఫుల్ పాత్రలో ఆయన కనిపించబోతున్నారని, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఈ సినిమాలోని భావోద్వేగాలను మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తుందని చిత్రబృందం నమ్మకంతో ఉంది. జులై 10న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

Tags:    

Similar News