Jayam Ravi: భార్య వదిలేసింది.. ప్రియురాలు బ్రేకప్ చెప్పింది.. మీడియా ముందు బోరున ఏడ్చేసిన హీరో
Jayam Ravi: కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి తన విడాకుల వ్యవహారంపై మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేస్తూ బోరున ఏడ్చేశారు.
Jayam Ravi: భార్య వదిలేసింది.. ప్రియురాలు బ్రేకప్ చెప్పింది.. మీడియా ముందు బోరున ఏడ్చేసిన హీరో
Jayam Ravi: కోలీవుడ్ సీనియర్ హీరో జయం రవి వ్యక్తిగత జీవితం గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. భార్య ఆర్తితో విడాకుల ప్రకటన తర్వాత ఎన్నో వివాదాలు, మరెన్నో ట్రోల్స్ ఎదుర్కొన్న ఆయన.. తాజాగా చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక్కసారిగా బద్దలయ్యారు. ఇన్నేళ్లుగా గుండెల్లో దాచుకున్న ఆవేదనను, అవమానాలను తలచుకుంటూ మీడియా ముందే కన్నీరు పెట్టుకున్నారు.
తమ మధ్య విడాకులకు సింగర్ కేనీషాతో ఉన్న రిలేషనే కారణమంటూ వస్తున్న వార్తలపై, అలాగే తన అత్తగారి ఇల్లాలిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. తన పిల్లల గురించి మాట్లాడుతూ.. జయం రవి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కొందరు కావాలనే పిల్లలను తన నుంచి దూరం చేస్తున్నారని ఆరోపించారు.
నేను నా పిల్లలను వదిలేశానని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఏడాదికి రూ. 50 లక్షలు ఫీజు కట్టి మరి నా పిల్లల్ని చదివిస్తున్నాను. నా ప్రాణాలైన పిల్లల్ని నేనెలా వదులుకుంటాను? అని ఆయన ప్రశ్నించారు. పిల్లలను అడ్డం పెట్టుకుని నన్ను అవమానించవద్దు. నన్ను ఇబ్బంది పెట్టాలనుకునే వారు నేరుగా నా ఆఫీసుకు రావొచ్చు, అంతేకాని పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని హెచ్చరించారు.
నాపై చేతబడి చేశారు
ఈ ప్రెస్ మీట్‌లో జయం రవి చేసిన అత్యంత షాకింగ్ కామెంట్స్ చేతబడి గురించే. ఇండస్ట్రీలోకి వచ్చి 23 ఏళ్లు అవుతున్నా ఎలాంటి మచ్చ లేకుండా బతికిన తనకు, పెళ్లి తర్వాత నరకం కనపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లైన మొదటి రోజు నుంచే నన్ను బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. నేను వారి చెప్పుచేతుల్లోనే ఉండాలని నాపై చేతబడి కూడా చేయించారు.
దాని ప్రభావం వల్ల ఇప్పుడు నాకు రక్తంతో వాంతులు అవుతున్నాయి. నన్ను పూర్తిగా చంపేయాలనే కుట్ర కూడా జరుగుతోంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపై తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనంగా ఉండే ప్రసక్తే లేదని, ఈ అవమానాలను భరించడం తన వల్ల కాదని స్పష్టం చేశారు. అంతేకాదు, తన విడాకుల కేసు పూర్తిగా ముగిసే వరకు సినిమాల్లో నటించబోనని సంచలన ప్రకటన చేశారు.
సింగర్ కేనీషా ట్విస్ట్..
జయం రవి విడాకులకు, సింగర్ కేనీషాతో ఆయనకున్న సాన్నిహిత్యమే కారణమంటూ నెట్టింట పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, సరిగ్గా రవి ప్రెస్ మీట్ పెట్టడానికి ముందే.. సింగర్ కేనీషా సోషల్ మీడియా వేదికగా ఒక షాకింగ్ పోస్ట్ పెట్టారు. జయం రవితో ఉన్న రిలేషన్‌కు తాను బ్రేకప్ చెబుతున్నట్లు ఆమె ప్రకటించడం ఈ వివాదంలో మరో పెద్ద మలుపుగా మారింది.