Superstar Krishna Villain Role: సూపర్‌స్టార్‌ కృష్ణ విలన్‌ నటించిన సినిమా... అదృష్టం బాగుంది కాబట్టే

Superstar Krishna Villain Role: తెలుగు సినిమా పరిశ్రమలో సాహసాలకు, ప్రయోగాలకు మారుపేరు సూపర్‌స్టార్‌ కృష్ణ. కలర్‌, 700 ఎంఎం, జేమ్స్‌బాండ్‌ వంటి ఎన్నో నూతన తరహా ప్రయోగాలు చేశారు.

Update: 2026-04-25 06:52 GMT

Superstar Krishna Villain Role

Superstar Krishna Villain Role: తెలుగు సినిమా పరిశ్రమలో సాహసాలకు, ప్రయోగాలకు మారుపేరు సూపర్‌స్టార్‌ కృష్ణ. కలర్‌, 700 ఎంఎం, జేమ్స్‌బాండ్‌ వంటి ఎన్నో నూతన తరహా ప్రయోగాలు చేశారు. ఇన్ని ప్రయోగాలు చేసిన సూపర్‌స్టార్‌ కృష్ణ సినీ రంగంలోకి అడుగుపెట్టిన తొలిరోజుల్లో నటుడిగా ఎదిగేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. తేనెమనసులు సినిమాలో హీరోగా పరిచయమైన కృష్ణ ఆ తరువాత వందలాది చిత్రాల్లో నటించారు. విచిత్రమేమంటే ఆయన చేసిన వందలాది చిత్రాల్లో ఒక్క సినిమాలో మాత్రం నెగెటీవ్‌ షేడ్స్‌ ఉండే పాత్రలో నటించారు. అదీ కెరీర్‌ ప్రారంభంలో. అదృష్టమేమంటే ఆ సినిమా హిట్‌కాలేదు. కానీ, నెగెటీవ్‌ రోల్‌ చేసిన కృష్ణకు మంచిపేరు వచ్చింది. అప్పట్లో హిట్‌ దర్శకుడిగా పేరు సంపాదించిన కె విశ్వనాథ్‌ తీసిన సినిమా ఇది.

విలన్ అవతారంలో కృష్ణ!

కృష్ణ ఇండస్ట్రీకి వచ్చిన సైడ్‌ క్యారెక్టర్‌గా కొన్ని సినిమాలు చేశారు. అదే సమయంలో హీరోగా ప్రయత్నించి సినిమాలు కూడా చేస్తున్నారు. కానీ, అవకాశం విలన్‌ రూపంలో రావడంతో కాదనకుండా ఒప్పేసుకున్నారు. విలన్‌గా ముద్రపడి తరువాత హీరోగా ఎదగడం కష్టం. కానీ, కెరీర్‌ స్టార్టింగ్‌లోనే ఆయన సాహసం చేశారు. 1967లో విడుదలైన ప్రైవేట్‌ మాస్టర్‌ అనే సినిమాలో విలన్‌గా నటించారు. కళాతపస్వి కె విశ్వనాథ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అందరూ తప్పకుండా ఈ సినిమా హిట్‌ అవుతుందని అనుకున్నారు. కె విశ్వనాథ్‌ కథకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. కథనాలను బలంగా చెప్పడంలో దిట్ట. రామ్మోహన్‌ అనే వ్యక్తిని హీరోగా పెట్టి ఈ సినిమా తీశారు. యువ హీరో ఇమేన్‌ను పక్కన పెట్టి కృష్ణ నటనకు ప్రాధాన్యత ఇచ్చి విలన్‌ పాత్రలో నటించారు. ఆరోజుల్లో ఇది పెద్ద సాహసం అనే చెప్పాలి.

ఆ 'ఫ్లాప్' వెనుక ఉన్న అదృష్టం!

తనకు వచ్చిన రోల్‌ను వందకు వందశాతం ఫర్‌ఫెక్ట్‌గా చేయడం కృష్ణ నైజం. హిట్టు ప్లాపులతో సంబంధం ఉండదు. విలన్‌గా మెప్పించినా సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు. దీంతో సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. విలన్‌గా మంచి నటనను కనబరిచినా లోలోపల తెలియని భయం. అభిమానులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అని టెన్షన్‌. ఒకవేళ సినిమా బ్లాక్‌బస్టర్‌ అయి ఉంటే ఈరోజు కృష్ణను విలన్‌గా మాత్రమే గుర్తుపెట్టుకునేవారేమో. అదృష్టం బాగుండబట్టి సినిమా ప్లాప్‌ అయింది. హీరోగా కృష్ణ హిట్టయ్యారు. విలన్‌ అనే ఇమేజ్‌ ఆయనపై పడలేదు. ఆ తరువాత కృష్ణ నటించిన గూఢాచారి 116 విడుదలైంది. ఈ సినిమా భారీ హిట్‌ కావడంతో తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని హీరోగా రాణించారు.

సాహసమే ఆయన శ్వాస

కెరీర్‌ ప్రారంభం నుంచి నటుడిగా చివరిశ్వాస వరకు ఎన్నో ప్రయోగాలు చేశారు. మొదటి సినిమా స్కోప్‌, మొదటి కౌబాయ్‌ సినిమా, మొదటి 70 ఎంఎం, కలర్‌ ఇలా ఒక్కటేమిటి ఎన్నింటినో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి సూపర్‌ స్టార్‌ కృష్ణ. ప్రైవేట్‌ మాస్టర్‌ సినిమా రూపంలో ఆయన చేసిన విలన్‌ ప్రయోగం కూడా మరోకోణంలో నటుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. వీలైతే ఒక్కసారి ప్రైవేట్‌ మాస్టర్‌ సినిమా చూడండి. విలన్‌గా కృష్ణ ఎలా నటించారో అర్ధమౌతుంది.

Tags:    

Similar News