Bigg Boss Telugu 10: హీరోయిన్ మెటీరియల్ బాసూ.. బిగ్‌బాస్‌లోకి వెళ్తుంది!

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 లోకి యాంకర్ చర్మిల నల్లూరి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వైరల్.

Update: 2026-08-20 07:18 GMT

Bigg Boss Telugu 10: హీరోయిన్ మెటీరియల్ బాసూ.. బిగ్‌బాస్‌లోకి వెళ్తుంది!

Bigg Boss Telugu 10: తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ త్వరలోనే 10వ సీజన్‌తో అలరించేందుకు సిద్ధమవుతోంది. విజయవంతంగా 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో, ఈసారి మరింత గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక ఎప్పటిలాగే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కూ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. సామాన్యులకు అవకాశం కల్పించేందుకు 'అగ్నిపరీక్ష సీజన్ 2' వేగంగా సాగుతోంది. దీనికి శ్రీముఖి యాంకర్‌గా, నవదీప్, అభిజిత్, బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.

లాంచ్ డేట్ దగ్గరపడుతుండటంతో హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్లపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక క్రేజీ అండ్ గ్లామరస్ యాంకర్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఆమే చర్మిల నల్లూరి.

ఇటీవల జరిగిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చర్మిల తన చురుకైన యాంకరింగ్, గ్లామర్‌తో అందరి దృష్టినీ ఆకర్షించింది. స్టేజ్ పైనే ఆమె ప్రతిభను చూసిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. స్వయంగా హీరోయిన్‌గా ఛాన్స్ ఇస్తానని ఆఫర్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

అయితే, హీరోయిన్ కంటే కూడా ఒక సక్సెస్ ఫుల్ యాంకర్‌గా మంచి స్థాయికి ఎదగడమే తన లక్ష్యమని చెబుతూ ఆ ఆఫర్‌ను సరదాగానే పక్కన పెట్టింది చర్మిల. ఇప్పుడు ఇదే చర్మిల నల్లూరి 'బిగ్‌బాస్ 10' హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టబోతోందనే ప్రచారం జోరందుకుంది.

దీనికి సంబంధించి బ్యాంకింగ్, అగ్రిమెంట్ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. చర్మిల ఎంట్రీ ఇస్తే షోకి కొత్త గ్లామర్ అటాచ్ అవ్వడమే కాకుండా, కాంట్రోవర్సీలు, గేమ్‌ప్లే పరంగా రేటింగ్స్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్తాయని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.

తన ముక్కుసూటితనంతో, స్టేజ్ ప్రెజెన్స్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా అల్లు అరవింద్‌నే ఇంప్రెస్ చేసిన ఈ బ్యూటీ నిజంగానే బిగ్‌బాస్ 10లో అడుగుపెడితే మాత్రం ఈ సీజన్ మరింత కలర్‌ఫుల్‌గా మారడం ఖాయం.


 


Tags:    

Similar News