Ram Pothineni: ఆ ఒక్క పోస్ట్‌తో హీరో రామ్‌తో రిలేషన్‌ని కన్ఫర్మ్ చేసేసిన హీరోయిన్

Ram Pothineni: టాలీవుడ్ హీరో రామ్ పోతినేని 38వ పుట్టినరోజు సందర్భంగా తన 23వ చిత్రానికి దర్శకుడిగా మారుతున్నట్లు ప్రకటించారు.

Update: 2026-05-16 05:19 GMT

Ram Pothineni: ఆ ఒక్క పోస్ట్‌తో హీరో రామ్‌తో రిలేషన్‌ని కన్ఫర్మ్ చేసేసిన హీరోయిన్

Bhagyashri Borse: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మే 15న తన 38వ పుట్టినరోజును ఎంతో గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఈ బర్త్ డే సందర్భంగా రామ్ తన అభిమానులకు ఒక ఊహించని క్రేజీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఇప్పటివరకు నటుడిగా, గాయకుడిగా, గీత రచయితగా అలరించిన రామ్.. తన 23వ సినిమా ద్వారా మెగాఫోన్ పట్టి డైరెక్టర్‌గా మారుతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉండగా, సోషల్ మీడియాలో ఒక హీరోయిన్ పెట్టిన బర్త్ డే పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే. రామ్‌కు ఆమె పంపిన ఆత్మీయ శుభాకాంక్షలు, వారి మధ్య ఉన్న లవ్ రూమర్లను మరోసారి తెరపైకి తెచ్చాయి.

భాగ్యశ్రీ ఎమోషనల్ పోస్ట్

రామ్ పుట్టినరోజు సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్, ఎక్స్ ఖాతాలో రామ్‌తో కలిసి దిగిన ఒక బ్యూటిఫుల్ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోతో పాటు ఆమె రాసిన లైన్స్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. "హ్యాపీ బర్త్ డే రామ్.. జీవితంలోని ప్రతి విషయంలోనూ స్ఫూర్తినిచ్చే వ్యక్తి మనకు అంత తరచుగా తారసపడరు. నిన్ను చూసి నేను ఆశ్చర్యపోకుండా ఉండలేకపోతున్నాను. నీలాంటి స్నేహితుడు నాకు తోడుగా ఉన్నందుకు నేను కృతజ్ఞురాలిని. ఈ ఏడాది నీ గర్జనల ప్రయాణం అడవి అంతటా ప్రతిధ్వనించేలా ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ రామ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంది.

ప్రేమాయణం.. నిజమేనా?

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే కలిసి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడకపోయినప్పటికీ.. వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయం నుంచే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో తెగ ప్రచారం సాగింది.

వీరిద్దరూ రియల్ లైఫ్‌లో డేటింగ్ చేస్తున్నారని, ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం ప్రేమగా మారిందని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇప్పటివరకు వీరిద్దరూ ఈ రూమర్లను ఖండించకపోవడం విశేషం. ఇప్పుడు రామ్ బర్త్ డేకి భాగ్యశ్రీ ఇంత స్పెషల్‌గా, కాస్త ఎమోషనల్‌గా విష్ చేయడంతో.. వీరి మధ్య కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉందా? లేక అంతకు మించి ఏమైనా ఉందా? అనే చర్చ నెట్టింట మళ్లీ మొదలైంది.

వరుస ఫ్లాపులు పడుతున్నా భాగ్యశ్రీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం అఖిల్ అక్కినేని సరసన 'లెనిన్' సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ, కోలీవుడ్‌లో శివకార్తికేయన్ సరసన ఒక క్రేజీ ప్రాజెక్టును దక్కించుకుంది. మరి రాబోయే సినిమాలతోనైనా ఈ ముద్దుగుమ్మ మొదటి సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.


Tags:    

Similar News