Akhil Akkineni: సమంతపై అక్కినేని అఖిల్ సెన్సేషనల్ కామెంట్స్..నాగ చైతన్యతో విడాకుల తర్వాత తొలిసారి
Akhil Akkineni: అక్కినేని అఖిల్ తన లేటెస్ట్ మూవీ 'లెనిన్' ప్రమోషన్స్‌లో సమంత నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Akhil Akkineni: సమంతపై అక్కినేని అఖిల్ సెన్సేషనల్ కామెంట్స్..నాగ చైతన్యతో విడాకుల తర్వాత తొలిసారి
Samantha: టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన కెరీర్‌లో మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇండస్ట్రీలో సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్, ఈసారి ఎలాగైనా ‘లెనిన్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని పక్కా వ్యూహంతో దూసుకుపోతున్నాడు. సరిగ్గా మరో వారం రోజుల్లో అంటే జూలై 10న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతున్న తరుణంలో, అఖిల్ ఇంటర్వ్యూలు, ప్రమోషన్స్ అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అఖిల్.. స్టార్ హీరోయిన్ సమంత లేటెస్ట్‌గా నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమాపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా గురించి అఖిల్ స్పందిస్తూ.. తాను ఈ సినిమాను ఇంకా చూడలేదని, కానీ సినిమాపై చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని వెల్లడించారు. నేను ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ చూశాను. అందులో సమంత యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంది. ఆ ట్రైలర్ చూడగానే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందని నాకు అనిపించింది. ఈ అద్భుతమైన ప్రయత్నానికి సమంతతో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ అఖిల్ ప్రశంసల జల్లు కురిపించారు.
ఒకప్పుడు ఒకే కుటుంబానికి చెందిన వారైన అఖిల్.. సమంత సినిమాపై ఇలా ఓపెన్‌గా పాజిటివ్ కామెంట్స్ చేయడంతో అక్కినేని మరియు సమంత ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ఇక అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం విషయానికి వస్తే.. ప్యూర్ రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. అఖిల్ మాస్ అండ్ రగ్గడ్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది.
జూలై 10వ తేదీన గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. అఖిల్ సరసన భాగ్యశ్రీ నటిస్తోంది. ‘వినరో భాగ్యం విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కింగ్ అక్కినేని నాగార్జున, ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు. ఒకవైపు సమంత సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూనే.. మరోవైపు తన ‘లెనిన్’ సినిమాతో థియేటర్లలో మాస్ జాతర చేయడానికి సిద్ధమయ్యాడు అఖిల్. మరి ఈ జూలై 10న అఖిల్ ఖాతాలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ పడుతుందో లేదో చూడాలి.