Narsapur: నర్సాపూర్‌లో ఆర్టీసీ బస్సులో సీట్ పంచాయతీ.. పీఎస్‌కు బస్సు

Narsapur: మెదక్ నుండి సికింద్రాబాద్ వెళ్లే బస్సులో మహిళపై వ్యక్తి దాడి, బ్యాగ్ చింపివేత. ప్రయాణికుల ఆందోళనతో బస్సును నర్సాపూర్ పీఎస్‌కు తరలింపు.

Update: 2026-07-01 14:12 GMT

Narsapur: నర్సాపూర్‌లో ఆర్టీసీ బస్సులో సీట్ పంచాయతీ.. పీఎస్‌కు బస్సు

నర్సాపూర్: మెదక్ వైపు నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీట్ విషయంలో ప్రయాణికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నర్సాపూర్ వద్ద బస్సు ఎక్కిన మానసిక వికలాంగుడైన వినోద్ సీటు కోసం మరో మహిళతో గొడవకు దిగినట్లు సమాచారం.

ఈ క్రమంలో మహిళపై దాడి చేసి, ఆమె బ్యాగును చింపివేయడంతో బస్సులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేయడంతో బస్సును నేరుగా నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు ఇరువర్గాల నుంచి వివరాలు సేకరించి విచారణ చేపట్టారు.

Tags:    

Similar News