Medak: మోదీ పర్యటన వేళ పద్మా దేవేందర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు!
Medak: బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో, ఆయనను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Medak: మోదీ పర్యటన వేళ పద్మా దేవేందర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు!
మెదక్: బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. మదర్స్ డే రోజున హైదరాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ, మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై సమాధానం చెప్పాలని అన్నారు.
మోడీ ప్రసంగం ప్రారంభించక ముందే బండి సంజయ్‌ను పదవి నుంచి తొలగించాలని, లేనిపక్షంలో ప్రజలు ప్రధాని మాటలను పట్టించుకోరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రేవంత్ రెడ్డి హోంమంత్రిగా పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఒక మైనర్ బాలిక ఎఫ్‌ఐఆర్ నమోదు కోసం గంటల తరబడి పోలీస్ స్టేషన్‌లో వేచి ఉండాల్సి రావడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనమన్నారు.
మహిళా రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్‌లో గొప్పలు చెప్పుకున్న ప్రధాని మోదీ, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో మాత్రం మౌనం వహిస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ కుమారుడిపై ఆరోపణలు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్ల కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని అన్నారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని విమర్శించారు. బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు ఉపయోగపడే ఒక్క మాట కూడా బండి సంజయ్ మాట్లాడలేదని, రేవంత్ రెడ్డి ఆయనను కాపాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణపై ప్రధాని మోదీకి ప్రేమ లేదని, విభజన హామీలు ఇంకా అమలు కాలేదని విమర్శించారు.