Narsapur: మున్సిపల్ వార్డులో అధికారులతో కలిసి కౌన్సిలర్ స్పెషల్ డ్రైవ్
Narsapur: పట్టణంలోని 10వ వార్డులో నెలకొన్న తక్కువ వోల్టేజ్, తాగునీటి బోర్ మోటార్ సమస్యను కౌన్సిలర్ బుల్లెట్ రాజు అధికారులతో మాట్లాడి వేగంగా పరిష్కరించారు.
Narsapur: మున్సిపల్ వార్డులో అధికారులతో కలిసి కౌన్సిలర్ స్పెషల్ డ్రైవ్
నర్సాపూర్, జూలై 28: నర్సాపూర్ పట్టణంలోని 10వ వార్డులో గత కొంతకాలంగా నెలకొన్న తక్కువ వోల్టేజ్ సమస్యతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా బోర్‌వెల్ మోటార్లు సరిగా పనిచేయక తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న 10వ వార్డు కౌన్సిలర్ బుల్లెట్ రాజు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో నేరుగా మాట్లాడి సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. పనులు వేగంగా పూర్తయ్యేలా అక్కడే ఉండి స్వయంగా పర్యవేక్షించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అధికారులతో సమన్వయం చేస్తూ చర్యలు చేపట్టినట్లు కౌన్సిలర్ తెలిపారు. అలాగే వార్డులో ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజలను నేరుగా కలిసి తెలుసుకుంటూ, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా నిరంతరం కృషి చేస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు.
కౌన్సిలర్ బుల్లెట్ రాజు ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండడం పట్ల 10వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వార్డు లో బోర్ మోటార్ చెడి పోవడం తో దానికి మరమ్మత్తులు చేపట్టి నీటి సరఫరా సమస్య ను పరిష్కారించారు.. అలాగే విద్యుత్ సమస్య పరిష్కారానికి చొరవ చూపి, వార్డు లో ఉన్న తాగునీటి సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నందుకు ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ప్రజల సమస్యల పరిష్కారమే తన మొదటి ప్రాధాన్యత అని, వార్డు అభివృద్ధి కోసం ఇదే సేవాభావంతో ముందుకు సాగుతానని కౌన్సిలర్ బుల్లెట్ రాజు పేర్కొన్నారు.ఇ కార్యక్రమం లో స్థానిక అధికారులు 10 వార్డు ప్రజలు ఫాల్గొన్నారు.