Narsapur: నర్సాపూర్‌లో కోతుల బెడద నివారణకు ప్రత్యేక చర్యలు

Narsapur: నర్సాపూర్‌లో కోతుల బెడద నివారణకు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు. కోతులను పట్టుకుని అటవీ ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు.

Update: 2026-06-08 08:07 GMT

Narsapur: నర్సాపూర్‌లో కోతుల బెడద నివారణకు ప్రత్యేక చర్యలు

Narsapur: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పెరుగుతున్న కోతుల బెడదను నియంత్రించేందుకు మున్సిపల్ పాలకవర్గం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మున్సిపాలిటీలోని 15 వార్డుల పరిధిలో కోతులను నిర్బంధించి సమీప అటవీ ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.

ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ మాచునూరి లక్ష్మీ యాదవ్ మరియు వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు. ఇటీవల కాలంలో కోతుల దాడుల కారణంగా పలువురు ప్రజలు గాయపడిన నేపథ్యంలో, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. అనునిత్యం నర్సాపూర్ పట్టణంలో కోతులు ప్రజలపై దాడి చేసి గాయపరుస్తున్నాయని వాటి బెడద నివారించే విధంగా వాటిని నిర్బంధించి అడుగులలో వదిలిపెట్టే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, కోతుల బెడద వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రజలను ఈ సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించేందుకు దశలవారీగా కోతులను పట్టుకుని అటవీ ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు.

రానున్న రోజుల్లో పట్టణంలో కోతుల సంచారం పూర్తిగా తగ్గేలా సమగ్ర కార్యాచరణ అమలు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, వార్డు సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరారు.

Tags:    

Similar News