Medak: ఆర్టీసీ సమ్మె.. ప్రయాణికుల కోసం మెదక్ కలెక్టర్ స్పెషల్ యాక్షన్ ప్లాన్

Medak: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెదక్ జిల్లాలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.

Update: 2026-04-22 12:11 GMT

Medak: ఆర్టీసీ సమ్మె.. ప్రయాణికుల కోసం మెదక్ కలెక్టర్ స్పెషల్ యాక్షన్ ప్లాన్

మెదక్: ఆర్టీసీ సమ్మె దృశ్య ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పని చేస్తాం అన్నారు. ప్రైవేట్ వాహనదారులు ఎక్కువ ఛార్జ్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎమర్జెన్సీ అవసరాల కోసం కంట్రోల్ నంబర్ 9391942254 ఏర్పాటు చేశాం అని, ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి చేపట్టిన సమ్మె వల్ల జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు. సమ్మె తో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ బస్ డిపోల నుంచి బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మెదక్ నుంచి 100, నర్సాపూర్ నుంచి 34 బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు.

రెండు బస్ డిపోల పరిధిలో కొత్తగ కండక్టర్ లను నియమిస్తున్నం అని, అని అదే విధంగా గతంలో ఆర్టీసీ డ్రైవర్ ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారిని పరిశీలించి తీసుకుని వారి సేవలు వినియోగించుకుంటున్నం అన్నారు. పోలీస్, రెవెన్యూ, రవాణా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రైవేట్ స్కూల్స్, కంపెనీ ల వారిని సహకరించాలని కోరడం జరిగిందని వారి సహకారంతో ప్రజల అవసరాల మేరకు వారికి బస్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎమర్జెన్సీ అవసరాల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అవసరం ఉన్నవారు 9391942254 నంబర్ లో సంప్రదించాలని కోరారు.ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని ఎవరైనా ప్రైవేట్ వాహనదారులు అధిక ఛార్జీ లు వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డి పి ఆర్ ఓ రామచంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News