Mandamari: మందమర్రిలో అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ పరిశీలన

Mandamari: మందమర్రి ఏరియాలో సింగరేణి ఆధ్వర్యంలో అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ (UCG) పైలట్ బోర్‌హోల్ స్థలాన్ని పరిశీలించిన అధికారులు.

Update: 2026-08-12 17:41 GMT

Mandamari: మందమర్రిలో అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ పరిశీలన

మందమర్రి: సింగరేణి సంస్థ మందమర్రి ఏరియాలోని బెల్లంపల్లి ప్రాంతంలో చేపడుతున్న అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ (UCG) అన్వేషణ కార్యక్రమంలో భాగంగా ప్రతిపాదించిన పైలట్ బోర్‌హోల్ స్థలాన్ని అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

బుద గెస్ట్‌హౌస్ సమీపంలో ప్రతిపాదించిన బోర్‌హోల్ ప్రాంతాన్ని మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ఆదేశాల మేరకు అధికారులు సందర్శించారు. డ్రిల్లింగ్ పనులను ప్రారంభించేందుకు స్థలం అనుకూలత, క్షేత్రస్థాయి పరిస్థితులు, అవసరమైన ఏర్పాట్లపై అధికారులు సమగ్రంగా పరిశీలించారు.

డ్రిల్లింగ్ పనులు సజావుగా ప్రారంభించేందుకు చేపట్టాల్సిన ప్రాథమిక ఏర్పాట్లపై ఈ సందర్భంగా చర్చించారు. స్థల పరిశీలన అనంతరం అవసరమైన చర్యలు తీసుకునే దిశగా అధికారులు ముందుకు సాగనున్నారు.

ఈ పరిశీలనలో ఏజెంట్ సంతోష్ కుమార్, డీజీఎం (జియాలజీ) ఎం. రమేష్ బాబు, డీజీఎం ఎ.ఎస్.ఓ. దేశాయ్, డిప్యూటీ ఎస్‌ఈ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి భూగర్భ బొగ్గు వనరులను ఆధునిక సాంకేతికతతో వినియోగించుకునే దిశగా చేపడుతున్న UCG అన్వేషణలో భాగంగా ఈ పైలట్ బోర్‌హోల్ పరిశీలనకు ప్రాధాన్యత ఏర్పడింది.

Tags:    

Similar News