Vikarabad: వికారాబాద్ కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ!
Vikarabad: వికారాబాద్ కలెక్టరేట్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.
Vikarabad: వికారాబాద్ కలెక్టరేట్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ!
Vikarabad: వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు వందనం చేశారు.
అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం మార్మోగింది.