Wanaparthy: పెబ్బేరులో ఆర్‌ఎస్‌ఎస్ 'యువ సమ్మేళనం' ఘన విజయం!
Wanaparthy: వనపర్తి జిల్లా పెబ్బేరులో ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'యువ సమ్మేళనం' ఘనంగా జరిగింది.
Wanaparthy: పెబ్బేరులో ఆర్‌ఎస్‌ఎస్ 'యువ సమ్మేళనం' ఘన విజయం!
వనపర్తి: ఆర్.ఎస్.ఎస్ పెబ్బేరు ఖండ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సమ్మేళనం బుధవారం ఘనంగా జరిగింది. వనపర్తి జిల్లా పెబ్బేరులోని వల్లపురెడ్డి రాంరెడ్డి ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. మొబైల్ వినియోగం, వ్యసనాలు, నిరాశ వంటి సవాళ్లను అధిగమించి సంస్కారవంతమైన జీవనం, సమాజ సేవ వైపు యువత అడుగులు వేయాలని వక్తలు సూచించారు.
“లేచి నిలబడు.. మేల్కొను.. లక్ష్యం చేరేవరకు విశ్రమించకు” అనే స్వామి వివేకానంద సందేశంతో యువతలో స్ఫూర్తిని నింపారు. సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పాల ప్రసాద్ ముఖ్య వక్తగా, జ్యేష్ఠ కార్యకర్త రావుల రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
యువశక్తి దేశానికి బలమని, క్రమశిక్షణతో కూడిన యువత సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన యువతకు, సహకరించిన హిందూ బంధువులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.