Narayanpet: పొగమంచుతో అప్రమత్తంగా ఉండాలి జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

నారాయణపేట: నారాయణపేట... వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు రాత్రి వేళల్లో, తెల్లవారుజామున ప్రయాణాలను నివారించాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం తప్పనిసరైతే వాహనాలను నెమ్మదిగా, జాగ్రత్తగా నడుపుతూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని జిల్లా ఎస్పీ డా.వినీత్ జిల్లా ప్రజలకు సూచించారు.

ఇటీవల పొగమంచు కారణంగా చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో జిల్లా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

ముఖ్యంగా రాత్రి వేళల్లో, తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులు, మలుపులు సరిగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. తక్కువ దూరం మాత్రమే కనిపించే పరిస్థితుల్లో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాపాయానికి దారితీస్తుందని, అత్యవసరమైతే తప్ప ఈ సమయాల్లో ప్రయాణాలు చేయవద్దని సూచించారు.

Tags: