Makthal: మక్తల్‌లో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్!

Makthal: మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 14 వార్డులలో రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారి ఆదేశాల మేరకు ఇటీవల నిర్వహించిన పింఛన్ల మంజూరు కార్యక్రమంలో మిగిలిపోయిన లబ్ధిదారులకు నేడు మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి వాకిటి మానస హనుమంతు గారి చేతుల మీదుగా పింఛన్లను పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా పింఛన్లు అందుకున్న లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, గత పది సంవత్సరాలుగా ఎంతో ఆశతో, ఆతృతగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన తర్వాత తమ కల నెరవేరిందని, పింఛన్లు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కన్నీటి పర్యంతమవుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

పేదలు, వృద్ధులు, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాకిటి హనుమంతు , కారంపొడి శ్రీనివాసులు , ఏఎంసీ డైరెక్టర్ వి. అంజనేయులు , వాకిటి శ్యామ్ , మొహమ్మద్ ఫయాజ్ , వాకిటి భీమేష్, , బ్యాంక్ మధు, అంజప్ప, డీజే నర్సింహా, బాబు కిరాణం, క్రిష్ణ గారు నానీ,రాము, తదితరులు పాల్గొన్నారు.

Tags: