Devarkadra: మహిళా భవనం ప్రారంభించి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

దేవరకద్ర: దేవరకద్ర మండలం చిన్న రాజమూర్ గ్రామంలో 10 లక్షల రూపాయలతో నిర్మించిన మహిళా సంఘం భవనాన్ని ప్రారంభించి, మహిళలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో పదేళ్లపాటు రేషన్ కార్డులు ఇవ్వలేదని దీంతో చాలామంది నిరుపేదలు ప్రభుత్వ ఉచిత బియ్యానికి నోచుకోలేదని , కనీసం పుట్టిన పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డుల్లో నమోదు చేయలేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు.

మన ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తున్నామని తెలిపారు. ఈ రోజు ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని అర్హులైన ప్రతి కుటుంబానికి కుటుంబ బీమా పథకం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటలో ప్రారంభిస్తున్నారని తెలిపారు.

అన్ని విధాలుగా పేదలకు లబ్ధి చేకూరే విధంగా ప్రజా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామని ప్రజలందరూ ప్రజా ప్రభుత్వం వెంటే ఉన్నారని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అంజిల్ రెడ్డి, సర్పంచ్ హన్మంతు, భరత్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ప్రేమ్ కుమార్ యాదవ్, ఓ బి సి మండల అధ్యక్షుడు గోపాల్, ఉప సర్పంచ్ భాగ్యమ్మ, కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్ యాదవ్, మేదరి శ్రీనివాసులు, పసుపుల హనుమంతు, నత్తి కుర్మయ్య, అంకిల రాములు, పి ఎస్ సి ఎస్ డైరెక్టర్ వెంకటరెడ్డి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags: