Lifestyle: త‌ర‌చూ ఏదో ఒక‌టి తింటుంటారా.? అయితే మీకు ఈ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు

Lifestyle: మ‌న‌లో కొంత‌మందికి ఎప్పుడు ఏదో ఒక‌టి తినే అలవాటు ఉంటుంది.

Update: 2026-05-17 10:02 GMT

Lifestyle: త‌ర‌చూ ఏదో ఒక‌టి తింటుంటారా.? అయితే మీకు ఈ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు

Lifestyle: మ‌న‌లో కొంత‌మందికి ఎప్పుడు ఏదో ఒక‌టి తినే అలవాటు ఉంటుంది. కొద్దికొద్దిగా తరచూ తింటే శరీరానికి ఎనర్జీ వస్తుందని, మెటబాలిజం వేగంగా పనిచేస్తుందని న‌మ్ముతారు. అయితే ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉంది.? నిజంగానే ఈ అల‌వాటు మంచిదా.? ఇప్పుడు తెలుసుకుందాం.

తరచూ తినడం నిజంగా ఆరోగ్యకరమేనా?

ఇప్పటి వరకు చిన్న చిన్న మిల్స్ తరచూ తింటే బరువు తగ్గుతారని, శరీరం యాక్టివ్‌గా ఉంటుందని భావించేవారు. కానీ పోషకాహార నిపుణులు ఇప్పుడు ఈ విషయాన్ని కొత్త కోణంలో చూస్తున్నారు. రోజంతా ఎన్ని సార్లు తింటున్నామన్నదికంటే మొత్తం ఎంత క్యాలరీలు తీసుకుంటున్నామన్నదే ముఖ్యమని చెబుతున్నారు. చాలా మంది స్నాక్స్ పేరుతో బిస్కెట్లు, చిప్స్, స్వీట్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇవి శరీరానికి అవసరానికి మించి క్యాలరీలు అందిస్తాయి. దీంతో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

తరచూ తింటే బరువు ఎందుకు పెరుగుతుంది?

చాలా మందికి “నేను పెద్దగా భోజనం చేయడం లేదు.. అయినా బరువు పెరుగుతోంది” అనే సందేహం ఉంటుంది. దీనికి ప్రధాన కారణం మధ్య మధ్యలో తీసుకునే స్నాక్సే అని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు టీతో బిస్కెట్లు, పని చేస్తూ చిప్స్, సాయంత్రం కాఫీతో స్నాక్స్, జిమ్ తర్వాత ప్రోటీన్ బార్లు ఇలా చిన్న చిన్నగా తీసుకునే ఆహారం రోజుకు వందల క్యాలరీలు పెంచేస్తుంది. అవి పెద్దగా అనిపించకపోయినా మొత్తం కలిపి చూస్తే అధిక క్యాలరీలు శరీరంలో చేరుతాయి. దీని వల్ల క్రమంగా బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.

ఆకలి, అలవాటు మధ్య తేడా మరిచిపోతున్నారా?

తరచూ తినే అలవాటు వల్ల చాలా మంది నిజమైన ఆకలి ఏది, కేవలం అలవాటు ఏది అన్నది గుర్తించలేకపోతున్నారు. కొందరు ఆకలితో కాకుండా బోర్‌గా అనిపించినప్పుడు, టెన్షన్‌లో ఉన్నప్పుడు లేదా టైమ్ పాస్ కోసం తింటూ ఉంటారు. ఇలా నిరంతరం ఏదో ఒకటి తినడం వల్ల శరీరానికి అవసరం లేని ఆహారం ఎక్కువగా చేరుతుంది. దీని ప్రభావం జీర్ణక్రియపై కూడా పడుతుంది. కడుపు ఉబ్బరం, బరువుగా అనిపించడం, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది.

ఇన్సులిన్ లెవెల్స్‌పై కూడా ప్రభావం

మ‌నం తినే ప్రతి ఆహారం శరీరంలో బ్లడ్ షుగర్‌ను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా తీపి పదార్థాలు, రిఫైండ్ ఫుడ్స్ తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దాన్ని నియంత్రించడానికి శరీరం ఇన్సులిన్ విడుదల చేస్తుంది.

రోజంతా తరచూ తింటూ ఉంటే ఇన్సులిన్ స్థాయిలు నిరంతరం ఎక్కువగానే ఉండే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు దారితీయొచ్చు. తద్వారా డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా తినాలి?

ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం తినే సమయం కాకుండా తినే ఆహారం కూడా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రోటీన్, ఫైబర్, మంచి కొవ్వులు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ప్రతి రెండు గంటలకు స్నాక్స్ తినడం కంటే సరైన సమయంలో సమతుల ఆహారం తీసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి జీర్ణక్రియ కోసం కొంత విరామం ఇవ్వడం కూడా ఆరోగ్యానికి అవసరమని సూచిస్తున్నారు.

Tags:    

Similar News