Kurnool: ప్రిన్సిపాల్ డాక్టర్ నాగస్వామి నాయక్‌ను సత్కరించిన ఎంపీ!

Kurnool: కర్నూలు బి.క్యాంప్: ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల, బి. క్యాంప్, కర్నూలు ప్రిన్సిపాల్ మరియు NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ S. నాగస్వామి నాయక్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు శ్రీ బస్తిపాటి నాగరాజు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ నాగస్వామి నాయక్ గారిని తన నివాసానికి ఆహ్వానించి, ఎంతో ఆప్యాయంగా పలకరించి, శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా డాక్టర్ నాగస్వామి నాయక్ విద్యారంగంలో ఇప్పటివరకు సాధించిన 200కు పైగా అవార్డులు, పురస్కారాలు, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి గుర్తింపులు, కళాశాల అభివృద్ధికి చేస్తున్న కృషి, విద్యార్థుల సంఖ్య పెంపు, ఉత్తమ పరీక్షా ఫలితాలు, విద్యార్థుల భవిష్యత్తు కోసం చేపడుతున్న వినూత్న కార్యక్రమాల గురించి ఎంపీ కి వివరించారు.

ముఖ్యంగా గత ఆదివారం ప్రచురితమైన మ్యాగజైన్‌లో డాక్టర్ నాగస్వామి నాయక్ సేవలు, విజయాలు, విద్యారంగంలో ఆయన చేస్తున్న కృషి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకునేలా ప్రచురితం కావడం పట్ల ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు. ఆ మ్యాగజైన్‌లో వచ్చిన కథనాన్ని తాను కూడా చదివానని, ఒక ప్రభుత్వ కళాశాలను అభివృద్ధి పథంలో నడిపిస్తూ, విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఎంపీ బస్తిపాటి నాగరాజు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల అభివృద్ధికి డాక్టర్ నాగస్వామి నాయక్ చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయమని అన్నారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచడంతో పాటు, ఉత్తమ పరీక్షా ఫలితాలు సాధించడం వెనుక ప్రిన్సిపాల్ నాయకత్వం, ప్రణాళికాబద్ధమైన నిర్వహణ, అధ్యాపకుల సమిష్టి కృషి ఉన్నాయని ప్రశంసించారు.

కళాశాల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన ప్రతి ఒక్క లెక్చరర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం డాక్టర్ నాగస్వామి నాయక్ కోల్‌కతాలో జరిగిన జాతీయ స్థాయి విద్యా సదస్సులో అందుకున్న అంతర్జాతీయ స్థాయి అవార్డు, International Best Teacher గుర్తింపు, అలాగే NSS ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా రాయలసీమ విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహిస్తున్న సేవలకు సంబంధించిన ప్రశంసా పత్రాలు, సర్టిఫికెట్లు, పతకాలను ఎంపీ గారికి చూపించారు. వాటిని పరిశీలించిన ఎంపీ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మీ లాంటి ప్రతిభావంతులైన, సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులు దేశానికి ఎంతో అవసరం. విద్యార్థుల్లోనే కాకుండా ప్రజల్లో కూడా మార్పు తీసుకురాగల శక్తి మీలో ఉంది. విద్యార్థులకు విద్యతో పాటు సామాజిక బాధ్యత, నైతిక విలువలు, పర్యావరణ పరిరక్షణ, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, విద్యార్థుల మరియు ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలి" అని సూచించారు.

అంతేకాకుండా, ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించేందుకు వచ్చే జనవరి నెలలో కళాశాలను సందర్శిస్తానని ఎంపీ గారు తెలిపారు.

డాక్టర్ S. నాగస్వామి నాయక్ విద్యారంగ సేవలు

డాక్టర్ నాగస్వామి నాయక్ గారు ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. కళాశాలలో విద్యార్థుల ప్రవేశాల పెంపు, విద్యా ప్రమాణాల మెరుగుదల, ఉత్తమ ఫలితాల సాధన, విద్యార్థులకు ఉపాధి అవకాశాల కల్పన, ఉద్యోగ మేళాల నిర్వహణ, ఉచిత వైద్య శిబిరాలు, కంటి పరీక్షలు, సామాజిక సేవా కార్యక్రమాలు, NSS ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావడం వంటి అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

కేవలం కళాశాల పరిపాలనకే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సామాజిక స్పృహ, సేవాభావం పెంపొందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి. ఆయన సాధించిన విజయాలు కళాశాలకే కాకుండా కర్నూలు జిల్లాకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తున్నాయి.

ఈ సందర్భంగా ఎంపీ గారి ప్రశంసలు, సత్కారం డాక్టర్ నాగస్వామి నాయక్ మరింత ప్రోత్సాహాన్ని అందించాయి. ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలను మరింత అభివృద్ధి చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన భవిష్యత్తును అందించాలనే సంకల్పానికి ఈ అభినందనలు మరింత బలాన్ని చేకూర్చాయి.

Tags: