Kurnool: కర్నూలు ప్రభుత్వ వొకేషనల్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం!
Kurnool: కర్నూలు నగరంలోని ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్లస్టర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జి. యల్లా కృష్ణ పాల్గొన్నారు.
Kurnool: కర్నూలు ప్రభుత్వ వొకేషనల్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం!
కర్నూలు: కర్నూలు నగరంలోని ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్లస్టర్ యూనివర్సిటీ ఆర్థికశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ G. యల్లా కృష్ణ హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS P.O డాక్టర్ S. నాగస్వామి నాయక్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ G. యల్లా కృష్ణ గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన హక్కులు, బాధ్యతలు, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం మరియు ప్రజాస్వామ్య విలువల గురించి వివరించారు. ప్రతి పౌరుడు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండటంతో పాటు రాజ్యాంగం సూచించిన మార్గంలో నడుచుకోవాలని విద్యార్థులకు సూచించారు.
అనంతరం విద్యార్థులతో భారత రాజ్యాంగ పీఠిక పఠనం చేయించి, రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు మరియు ప్రాథమిక విధులపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS P.O డాక్టర్ S. నాగస్వామి నాయక్ గారు, ముఖ్య అతిథి డాక్టర్ G. యల్లా కృష్ణ గారు, కళాశాల Staff మల్లికార్జున, విజయశేఖర్, రామకృష్ణ, కృష్ణమోహన్, సోమేష్, ఉల్గోజి రావు, చిన్న మల్లేష్, శారధి పటేల్, శ్రీధర్ మూర్తి, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు. మరియు విద్యార్థులు పాల్గొన్నారు.