Kurnool: కర్నూలులో పీసీ పీఎన్‌డీటీ జిల్లా స్థాయి కమిటీ సమావేశం!

Kurnool: కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ కామేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో పీసీ పీఎన్‌డీటీ కమిటీ సమావేశం.

Update: 2026-08-29 11:35 GMT

Kurnool: కర్నూలులో పీసీ పీఎన్‌డీటీ జిల్లా స్థాయి కమిటీ సమావేశం!

Kurnool: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో డి.ఎం.అండ్.హెచ్.ఓ. డా.వై.కామేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి పి.సి.&పి.ఎన్డి.టి(PC&PNDT) అడ్వైజరీ కమిటీ సమావేశము జరిగినది. స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం వచ్చిన దరఖాస్తులను సభ్యులు పరిశీలించారు. సరైన పత్రాలు లేని కొన్ని ఆస్పత్రులకు నోటీసులు ఇవ్వాలని కమిటీ తీర్మానించింది.

మిగిలినవి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్ర పియట్ అథారిటీ కమిటీ ఆమోదం కోసం పంపాలని తీర్మానించారు. జిల్లావ్యాప్తంగా పి.సి.పి.ఎన్డి.టి(PC&PNDT ACT) చట్టం గురించి అవగాహన కల్పించాలని కమిటీ సూచించింది.

ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. ఎల్ .భాస్కర్, పి.సి.&పి.ఎన్డి .టి జిల్లా నోడల్ అధికారి డా. ఉమా, ప్రొఫెసర్ & హెచ్.ఓ.డి. డా. స్నిగ్ధ చంద్రశేఖర్, ప్రొఫెసర్ & హెచ్.ఓ.డి డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాటిక్స్ డా.బి.విజయానంద బాబు, ప్రొఫెసర్&హెచ్.ఓ.డి డిపార్ట్మెంట్ & రేడియాలజీ డా. ఓ. డాక్టర్ పద్మలత, గ్రేడ్-వన్ ఫస్ట్ అడిషనల్ డిస్టిక్ కోర్ట్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి. సరళ దేవి, డిప్యూటీ డైరెక్టర్ అండ్ ఐ అండ్ పి ఆర్ డిపార్ట్మెంట్శ్రీమతి కే జయమ్మ సెయింట్ లౌడ్స్ ఎడ్యుకేషన్ సొసైటీ మేంబర్ శ్రీ.ఎం. నాగరాజు, సొసైటీ ఫర్ రూరల్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ మేంబర్ శ్రీ.కే .శ్రీనివాసులు, డిస్ట్రిక్ట్ ఎక్స్టెన్షన్ మీడియా ఆఫీసర్ శ్రీ. యన్ ప్రకాష్ రాజు, డిప్యూటీ డెమో శ్రీమతి షఫీ ఉన్నసాబేగం, మరియు జిల్లాస్థాయి ప్రోగ్రాం ఆఫీసర్స్ డిప్యూటీ హె. ఇ. ఓ పద్మావతి, ప్రాజెక్టనిష్టం ఖలీల్ పాల్గొన్నారు.

Tags:    

Similar News