Kurnool: ఐదేళ్ల భూ సమస్యకు 4 రోజుల్లోనే పరిష్కారం.. కలెక్టర్ చొరవ!

Kurnool: కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఒక్క నెల-ఒక నియోజకవర్గం-4 పర్యటనలు’ ద్వారా రైతుల భూ సమస్యలకు మోక్షం లభించింది.

Update: 2026-05-29 12:34 GMT

Kurnool: ఐదేళ్ల భూ సమస్యకు 4 రోజుల్లోనే పరిష్కారం.. కలెక్టర్ చొరవ!

Kurnool: ఒక్క నెల-ఒక నియోజకవర్గం-4 పర్యటనలు కార్యక్రమంలో భాగంగా రైతుల భూ సమస్యలను పరిష్కరించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. ఇనాం భూమి నుంచి పట్టా భూమిగా మార్చాలని వచ్చిన దరఖాస్తులను, పట్టా భూమి ప్రభుత్వ భూమిగా మార్చారని వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి, ఓర్వకల్లు మండలానికి చెందిన నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి, రాంమోహన్ రెడ్డి అనే రైతులకు ప్రొసీడింగ్స్ ను కలెక్టర్ అందచేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఒక్క నెల-ఒక నియోజకవర్గం-4 పర్యటనలు' కార్యక్రమం క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలను ఇస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. పాణ్యం నియోజకవర్గంలో 2 వ పర్యటన కు సంబంధించి నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఇనాం భూమి నుంచి పట్టా భూమిగా మార్చాలని వచ్చిన దరఖాస్తులను,పట్టా భూమి ప్రభుత్వ భూమిగా మార్చారని వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వాటిని కరెక్షన్ చేసి ఇనాం, ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మారుస్తూ ఉత్తర్వులను ముగ్గురికి ఇవ్వడం జరిగిందన్నారు.

ఈ విధంగా వచ్చిన అర్జీలలో ఏవైతే వెంటనే చేయగలమో వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని ఆనందం వ్యక్తం చేసిన రైతులు సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్న కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన నాగేశ్వర్ రెడ్డి అనే రైతు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రీ సర్వే ప్రక్రియ చేపట్టిన తర్వాత తన యొక్క సర్వే నంబర్ 208 పొలం ఇనాం భూములుగా నమోదయిందన్నారు. ఆ సమయంలో ఎన్ని సార్లు అర్జీలు ఇచ్చిన ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందని, చాలా కష్టాలు పడడం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఒక్క నెల-ఒక నియోజకవర్గం-4 పర్యటనలు' కార్యక్రమంలో భాగంగా పాణ్యం నియోజకవర్గంలో 2 వ పర్యటన జరిగిన సమయంలో దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అధికారులు వాటిని పరిశీలించి 4 రోజులలో తన యొక్క భూమిని పట్టా భూమిగా మారుస్తూ ఉత్తర్వులు అందచేయడం చాలా సంతోషంగా ఉందని రైతు నాగేశ్వర్ రెడ్డి తన యొక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సర్వే నంబర్‌ను ఇనాం భూమి నుంచి తొలగించి, పట్టా భూమిగా మార్చి ఇచ్చినందుకు కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి రైతు ధన్యవాదములు తెలిపారు.

సుబ్బారెడ్డి, రామ్మోహన్ రెడ్డి అనే రైతులు మాట్లాడుతూ ఓర్వకల్ మండలంలో ఉన్నటువంటి తమ యొక్క భూములను ప్రభుత్వ భూముల కింద పెట్టారని, గత ఐదేళ్లుగా ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినప్పటికీ కూడా సంబంధిత సమస్యను పరిష్కరించలేదని రైతులు తెలిపారు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "ఒక్క నెల-ఒక నియోజకవర్గం-4 పర్యటనలు' కార్యక్రమంలో రెవెన్యూ భూ సమస్యలను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తున్నారని తెలుసుకొని.. పాణ్యం నియోజకవర్గం రెండవ పర్యటనలో భాగంగా అర్జీ ఇవ్వడం జరిగిందని అర్జీ ఇచ్చిన వెంటనే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అధికారులు తమ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించి ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడం సంతోషంగా ఉందన్నారు.. ప్రభుత్వం ఇటువంటి వినూత్న కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా ఎటువంటి భూ సమస్యలు లేకుండా రైతులకు న్యాయం జరుగుతుందన్నారు.

కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఓర్వకల్లు తహసిల్దార్ విద్యా సాగర్, కల్లూరు తహసిల్దార్ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News