Kurnool: ఈ నెల 24న మెగా పేరెంట్స్ మీటింగ్!

Kurnool: కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో జూలై 24న మెగా పేరెంట్స్ మీటింగ్. తల్లిదండ్రుల భాగస్వామ్యం కోరిన జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి.

Update: 2026-07-16 12:26 GMT

Kurnool: ఈ నెల 24న మెగా పేరెంట్స్ మీటింగ్!

Kurnool: ఈ నెల 24న నిర్వహించనున్న మెగా పేరెంట్స్ మీటింగ్‌ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాస పురోగతి, విద్యా ప్రమాణాల మెరుగుదల, పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ముందస్తు సమాచారం అందించాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, విద్యాశాఖ, ఐసీడీఎస్, ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.

Tags:    

Similar News