Kurnool: ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి కర్నూలు కలెక్టర్‌కు AP JAC వినతి!
Kurnool: ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని కర్నూలు కలెక్టర్‌కు ఏపీ జేఏసీ అమరావతి వినతిపత్రం. 29 డిమాండ్లతో మలిదశ ఉద్యమానికి పిలుపు.
Kurnool: ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి కర్నూలు కలెక్టర్‌కు AP JAC వినతి!
Kurnool: ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు గిరి కుమార్ రెడ్డి మాట్లాడుతూ 29 డిమాండ్లతో మలి దశ ఉద్యమానికి ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
ఏ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘలు వ్యతిరేకం కాదని కేవలం తమ సమస్యల పరిష్కారం కోసం బకాయిలు చెల్లించుకోవడం కోసమే ఆందోళన చేస్తున్నామన్నారు. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఉన్న కీలకమైన మంత్రి ఏపీ జెఎసి అమరావతి ఉద్యమాన్ని పొలిటికల్ ఎజెండాతో చేస్తున్నారని చెప్పడం సరికాదన్నారు. గిరి కుమార్ రెడ్డి. ఏపీజేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు.