Nandigama: ఆటో డ్రైవర్ ఫిర్యాదుతో దొరికిపోయిన నకిలీ సివిల్ సప్లై టీమ్!

Nandigama: ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో నకిలీ పౌరసరఫరాల శాఖ అధికారుల గుట్టు రట్టు చేసిన పోలీసులు.

Update: 2026-08-09 12:15 GMT

Nandigama: ఆటో డ్రైవర్ ఫిర్యాదుతో దొరికిపోయిన నకిలీ సివిల్ సప్లై టీమ్!

నందిగామ: పౌరసరఫరాలశాఖ అధికారుల మని చెప్పి అర్ధరాత్రిళ్ల వాహనాల్ని ఆపి డబ్బులు వసూలు చేస్తున్న గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన విశాలాక్షి అనే మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులపై కేసునమోదయింది.

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి రేషన్ బియ్యం నూకలు ఆటోలో లోడ్ చేసుకొని చేపల చెరువుకి మేతకు తీసుకెళుతున్న క్రమంలో ఢిల్లీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ గల కారులో. ఒక మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు ఆటోని అడ్డగించి మేము పౌరసరఫరాల శాఖ అధికారులు అని చెప్పి డబ్బులు వసూలు చేసి అక్కడ నుంచి పరారైన ఘటన. ఆటో డ్రైవర్ కి అనుమానం వచ్చి అసలు వీరు పౌరసరఫరాల శాఖ అధికారుల కాదా అనే అనుమానంతో చందర్లపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు ఆటో డ్రైవర్ రవి.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు పలు కీలక విషయాలు సేకరించారు గతంలో చందర్లపాడు మండలంలో పలు గ్రామాలలో రేషన్ బియ్యాన్ని రవాణా అవుతుండగా ఇదే నకిలీ పౌర సరఫరాల శాఖ అధికారులు వాహనాలు ఆపి డబ్బులు వసూలు దండుకున్నట్లు పోలీసులు విచారణలో బయటపడింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News