Krishna: విజయ డెయిరీ నూతన ఛైర్మన్ బాలవర్ధనరావుకు హైకోర్టులో చుక్కెదురు!
Krishna: కృష్ణా జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ (విజయ డెయిరీ) నూతన ఛైర్మన్ దాసరి వెంకట బాలవర్ధనరావుకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Krishna: విజయ డెయిరీ నూతన ఛైర్మన్ బాలవర్ధనరావుకు హైకోర్టులో చుక్కెదురు!
కృష్ణా: కృష్ణా జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ (విజయ డెయిరీ) నూతన ఛైర్మన్ దాసరి వెంకట బాలవర్ధనరావుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనను మిల్క్ డైరెక్టర్ పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించినట్లు సమాచారం.
ఈ తీర్పుతో విజయ డెయిరీ ఛైర్మన్ పదవిలో ఆయన కొనసాగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. డైరెక్టర్ పదవికి అనర్హత వేటు పడటంతో ఛైర్మన్ పదవికి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. విజయ డెయిరీ రాజకీయాల్లో ఈ పరిణామం ఎలాంటి మలుపు తీసుకోనుంది? అనేది ఆసక్తికరంగా మారింది.