Pedana: పిల్లలకు కంటి పరీక్షల్లో కృష్ణా జిల్లాకు ఐదో స్థానం!

కృష్ణాజిల్లా, పెడన: ప్రభుత్వం చేపట్టిన పాఠశాల విద్యార్థుల కంటి పరీక్షల కార్యక్రమంలో జిల్లా రాష్ట్రస్థాయిలో ఐదో స్థానంలో నిలిచిందని జిల్లా అంధత్వ నివారణ కార్యక్రమ అధికారి డాక్టర్ జి.భానుమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ,ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 6 నుంచి 18 ఏళ్ల వయస్సు గల విద్యా ర్థులకు కంటి పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.

రాష్ట్ర సంయుక్త సంచాలకుడు డాక్టర్ సునీల్ కుమార్ నాయక్,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.ఎల్.దయాకర్ తనను అభినందించారని తెలిపారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విజయవం తంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్న పారామెడి కల్ ఆఫ్తాల్మిక్ అధికారులు, ఇతర వైద్య సిబ్బందిని డాక్టర్ భానుమూర్తి అభినందించారు.ఇదే స్ఫూర్తితో స్ఫూర్తితో కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా కొనసాగిస్తామని తెలిపారు.

Tags: