Sathupally: మంత్రి పొంగులేటి ఆదేశం: సత్తుపల్లిలో ప్రభుత్వ భూములపై యుద్ధప్రాతిపదికన సర్వే!
Sathupally: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని వేశ్యకాంతుల చెరువు ప్రాంతంలో ప్రభుత్వ భూములను గుర్తించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు యుద్ధప్రాతిపదికన సర్వే చేపట్టారు.
Sathupally: మంత్రి పొంగులేటి ఆదేశం: సత్తుపల్లిలో ప్రభుత్వ భూములపై యుద్ధప్రాతిపదికన సర్వే!
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం, వేశ్యకాంతుల చెరువు ప్రాంతం లో సర్వే చేసి ప్రభుత్వ భూమి ని గుర్తించాలి అని సత్తుపల్లి MRO గారికి, రెవిన్యూ అధికారులను ఆదేశించిన.... తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు.
యుద్ద ప్రాతిపదికన సర్వే చెయ్యాలి అని, ప్రభుత్వ భూమి ని గుర్తించి అట్టి భూములను ఈ కాంగ్రెస్ ప్రభుత్వంభూమి లేని పేద ప్రజలకు అందించే దిశగా సత్తుపల్లి నియోజకవర్గం MLA రాగమయిగారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో రెవిన్యూ అధికారులు,సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, రైతులు, సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్స్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.