Kothagudem: కొత్తగూడెంలో వరుణుడి కరుణ.. రోడ్లు జలమయం!
Kothagudem: తెలంగాణలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
Kothagudem: కొత్తగూడెంలో వరుణుడి కరుణ.. రోడ్లు జలమయం!
కొత్తగూడెం: రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కోల్ టౌన్ కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. అధిక వేడిమి, ఉక్కపోతలతో అల్లాడుతున్న నేపథ్యంలో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది.
వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. అకస్మాత్తుగా వర్షం కురవడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వర్షంతో వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. దీంతో గత కొన్ని రోజులుగా అధిక వేడిమి, ఉక్కపోతలతో ఇబ్బంది పడుతున్న ప్రజానీకానికి ఉపశమనం కలిగింది.