Kothagudem: నూతన పోలీస్ కార్యాలయ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన - ఎస్పీ
Kothagudem: కొత్తగూడెంలో నూతన పోలీస్ కార్యాలయ రోడ్డు నిర్మాణ పనులను ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Kothagudem: నూతన పోలీస్ కార్యాలయ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలన - ఎస్పీ
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన పోలీస్ కార్యాలయ సముదాయానికి నిర్మిస్తున్న రోడ్డు మార్గం పనులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలిసి నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి రోడ్డు నిర్మాణ ప్రగతిని, మార్గం రూపకల్పనను పరిశీలించారు.
ఈ సందర్భంగా రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిర్దేశిత కాలపరిమితిలో పనులను పూర్తి చేసి నూతన జిల్లా పోలీస్ కార్యాలయానికి రాకపోకలు సులభతరం అయ్యేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కొండ ప్రాంతాలు, సరిహద్దు భూభాగాల్లో రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా వర్షపు నీరు నిల్వ ఉండకుండా సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులను పక్కాగా చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పి ఆర్ సతీష్ కుమార్, ఎస్బి ఇన్స్పెక్టర్ ఇ. శ్రీనివాస్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, ఎస్ఐలు రమణారెడ్డి, సాయి కిషోర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.