Julurupadu: చెరువును తలపిస్తున్న ప్రధాన రహదారి

Julurupadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెంలో డ్రైనేజీ ఆక్రమణల వల్ల రాష్ట్రీయ రహదారి చెరువును తలపిస్తోంది.

Update: 2026-06-30 13:32 GMT

Julurupadu: చెరువును తలపిస్తున్న ప్రధాన రహదారి

Julurupadu: జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామపంచాయతీ పరిధిలో రాష్ట్రీయ రహదారికి ఇరువైపులా డ్రైనేజీని ఏర్పాటు చేశారు అయితే ఆ డ్రైనేజీ ఆక్రమణలకు గురి కావడంతో వర్షాకాలం వస్తే వర్షపు నీరంతా రోడ్డుపైనే ప్రవహిస్తుండటంతో ప్రధాన రహదారి చెరువును తలపిస్తుంది.

దీంతో రోడ్డుపైన ప్రయాణించే ద్విచక్ర వాహనదారులకు పాదచారులకు తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది పెద్ద వాహనాలు వెళ్ళేటప్పుడు రోడ్డుపైన ప్రవహిస్తున్న నీరు పాదచారుల పైన ద్విచక్ర వాహనదారుల పైన ఆ బురద నీరు పడటంతో వారి బాధ వర్ణనాధికతంగా మారింది.

డ్రైనేజీ దాటి ప్రధాన రహదారి సమీపం వరకు రేకుల షెడ్లను ఏర్పాటు చేయడంతో వాహనాల పార్కింగ్కు సైతం స్థలం లేక ట్రాఫిక్కు సైతం అంతరాయం ఏర్పడుతుంది.

స్థానికంగా దుకాణాల వద్దకు నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రజలు ద్విచక్ర వాహనాలను వేసుకొని వచ్చి రోడ్డుపైనే పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడటమే కాకుండా పోలీసులు రోడ్డు పైన పార్కింగ్ చేసిన వాహనాలకు చలానాలు విధించడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు.

అయితే ఈ సమస్యను స్థానిక ప్రజలు అధికారుల దృష్టికి వందలసార్లు తీసుకువెళ్లిన నిమ్మకు నీరెత్తినట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఏదో నోటీసులు ఇచ్చి మైక్ లో అనౌన్స్ చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప ఆక్రమణలు తొలగింపుకు మాత్రం శ్రీకారం చుట్టడం లేదు.

సంబంధిత అధికారుల తీరు ఎలా ఉందంటే వచ్చామా మా ఉద్యోగం ఏదో చేసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్లు ఉందే తప్ప ప్రజా సమస్యలపై మాత్రం దృష్టి సారించడం లేదు.

ఇదే సమస్యపై గతంలో కొందరు గ్రామస్తులు జిల్లా కలెక్టర్ గారిని సైతం కలిచారు. కలెక్టర్ గారు అప్పుడు స్థానిక అధికారులకు ఆదేశాలను కూడా జారీ చేశారు. అయితే స్థానిక అధికారులు అప్పటికప్పుడు ఏదో నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప ఆచరణకు మాత్రం నోచుకోలేదు.

అసలు అధికారులు ఆక్రమణల తొలగింపులు ఎందుకు వెనకడుగు చేస్తున్నారు? ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అన్న ప్రశ్న కూడా స్థానిక ప్రజలలో తలెత్తుతుంది.

ఏది ఏమైనా స్థానికంగా ఉండి ప్రజలు పడుతున్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదే. కానీ స్థానికంగా అధికారులు తీరు మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది పట్టణ ప్రాంతాల్లో ఉంటూ సుదూర ప్రాంతాల నుండి రాకపోకలు కొనసాగిస్తూ ప్రజా సమస్యలను మాత్రం గాలికి వదిలేస్తున్నారు.

ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ ఆక్రమణల తొలగింపు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. అధికారుల తీరు మార్చుకోకపోతే స్థానిక ప్రజలు మరోసారి కలెక్టర్ గారిని కలిసి అధికారుల తీరుపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News