Julurupadu: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐ కునంనేని ఫైర్
Julurupadu: జూలూరుపాడులో చేరుకున్న సీపీఐ ప్రజా చైతన్య యాత్ర. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన కునంనేని సాంబశివరావు.
Julurupadu: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐ కునంనేని ఫైర్
జూలూరుపాడు: కేంద్రంలో మోడీ సర్కార్ నియంతృత్వ పోకడలు. రాష్ట్రంలో హామీలను గాలికి వదిలి ప్రజల సమస్యల పరిష్కరించడం లేదని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు విమర్శించారు ప్రజా చైతన్య యాత్ర మంగళవారం జూలూరుపాడు చేరుకుంది పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలుకుతూ ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ప్రధాన సెంటర్లో ఏర్పాటుచేసిన మీటింగ్ లో సాంబశివరావు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏ ట రెండు కోట్ల ఉద్యోగాలు ఖాతాలో 15 లక్షలు , జమ ఉపాధి కల్పన వంటి కీలక హామీలను పక్కనపెట్టి మత విద్వేషాలతో కాలం వెల్లదీస్తుందని ఆరోపించారు.
నీట్ కుంభకోణంతో లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును చీకట్లో పడేసిందని దీనికి నిరసనగా జంతర్ మంతర్ వేదిక గా విద్యార్థులు యువత సాగించిన పోరాటం మోడీ దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చారని దేశ సంపదను కొంతమంది కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు.
దేశంలో త్వరితగతిన సామాజిక రాజకీయ మార్పు రావాల్సిన అవసరం ఉందని అందుకోసం సిపిఐ నడుం బిగిస్తుందని తెలిపారు యాత్రలో భాగంగా అనంతరం . గాంధీనగర్ వద్ద ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వర్లు , పుల్లారెడ్డి కొత్తగూడెం మేయర్ మూడు గణేష్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్రనరేంద్ర కుమార్, నరాటి ప్రసాద్, చంద్రగిరి శ్రీనివాస్ కంచర్ల జమలయ్య భూక్య శ్రీనివాస్ ఎస్ కే ఫయుం వరక అజిత్ సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు ఎస్కే నాగుల్ మీరా ఎల్లంకి మధు తదితరులు పాల్గొన్నారు.