Kothagudem: కొత్తగూడెం జనసేన ఆధ్వర్యంలో చిరంజీవి బర్త్‌డే వేడుకలు!

Kothagudem: కొత్తగూడెం చుంచుపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Update: 2026-08-22 11:25 GMT

Kothagudem: కొత్తగూడెం జనసేన ఆధ్వర్యంలో చిరంజీవి బర్త్‌డే వేడుకలు!

కొత్తగూడెం, ఆగస్టు 22: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను జనసేన పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్, డా. జి.ఎస్.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా. గడల శ్రీనివాసరావు పిలుపు మేరకు చుంచుపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో కష్టపడి చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా ఎదిగిన చిరంజీవి ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించడంతో పాటు సేవా కార్యక్రమాల ద్వారా కూడా ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి రక్తదానం అందేలా కృషి చేసి, అనేక మంది ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారని వక్తలు తెలిపారు. ఆయన మరిన్ని సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండి ప్రజాసేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News