Aswaraopeta: ఇందిరమ్మ కుటుంబ బీమా ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం!

Aswaraopeta: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన ప్రతి కుటుంబానికి బీమా సౌకర్యం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అశ్వరావుపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు వ్యక్తం చేశారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3, 4 మరియు 15 వార్డులలో ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఈ బీమా సౌకర్యాన్ని నమోదు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ టి దిలీప్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నశెట్టి సత్యనారాయణ, కౌన్సిలర్లు డేరంగుల ప్రసాద్ దగ్గు మిల్లి మౌనిక, చిన్నశెట్టి శ్రీను, కట్టా సింధుజ తదితరులు పాల్గొన్నారు.

Tags: