Julurupadu: మార్కెట్లో రూ.8,830 పత్తి ధర.. సౌకర్యాల లేమితో రైతుల గోడు!
Julurupadu: జూలూరుపాడు ఉప మార్కెట్ యార్డ్‌కు భారీగా పత్తి పోటెత్తింది. క్వింటాలుకు రూ. 8,830 ధర పలకడంతో విక్రయాలు జోరుగా సాగాయి.
Julurupadu: మార్కెట్లో రూ.8,830 పత్తి ధర.. సౌకర్యాల లేమితో రైతుల గోడు!
Julurupadu: జూలూరుపాడు మండల కేంద్రంలోని ఉప మార్కెట్ కు పత్తి పోటెత్తింది. వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు పత్తిని విక్రయించేందుకుగాను జూలూరుపాడు మార్కెట్ కు తీసుకుని వస్తున్నారు. బుధవారం ఉప మార్కెట్ యార్డ్ లో వ్యాపారులు జోరుగా పత్తి కొనుగోలు జరిపారు. ఏకంగా జెండా పాట రూ 8830లు పలికింది.
పత్తికి ప్రభుత్వ మద్దతు ధర 8667 రూపాయలు ఉండగా అంతకుమించి జూలూరుపాడు మార్కెట్ యార్డులో 8830 రూపాయల జెండా పాట పలకటం విశేషం. దీంతో పత్తి ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులు పత్తిని విక్రయించేందుకు ఆసక్తి చూపడంతో ఒక్కసారిగా మార్కెట్ యార్డ్ కు పత్తి పోటెత్తింది. పత్తి మంచిగా ఉండడంతో వ్యాపారులు కూడా అధిక ధరకు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు.
భద్రాద్రి, ఖమ్మం జిల్లాలకు చెందిన రైతులతో పాటు పక్క రాష్ట్రమైన ఆంధ్ర నుండి కూడా రైతులు వాహనాలలో పత్తిని విక్రయించడానికి తీసుకు వచ్చారు. వాహనాలు అధికంగా రావడంతో రహదారి పైనే బారులు తీరాయి. వాహనాల రద్దీతో మార్కెట్ కిక్కిరిసినట్లు అయింది.
దీంతో రైతులకు కొంత అసౌకర్యానికి గురయ్యారు. సుమారు పది వేల క్వింటాల పత్తిని వ్యాపారులు కొనుగోలు చేశారు. గత మూడు రోజులుగా జూలూరుపాడు మార్కెట్ యార్డు కు అధిక మొత్తంలో పత్తి వస్తున్నట్లు మార్కెట్ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం పత్తి ధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ పత్తికి మద్దతు ధర రూ పది వేలు ఉన్నట్లయితే రైతులకు కొంత లాభం చేకూరుతుందని పలువు రైతులు అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా జూలూరుపాడు ఉప మార్కెట్ యార్డ్ లో తాము తీసుకొచ్చిన పత్తిని నిలువ చేసేందుకు షెడ్లు కూడా లేవని నించున్నందుకు నీడ పట్టు కూడా లేదని, కనీసం త్రాగేందుకు నీటి నీటి సౌకర్యం కూడా లేక ఇబ్బందులు గురవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులు సరైన సౌకర్యాలు కల్పించాలని రైతులు కోరుతున్నారు.