Khammam: ఖమ్మం జిల్లా కార్యకర్తలు చూపిన చొరవ, క్రమశిక్షణ అభినందనీయం!
Khammam: హైదరాబాద్లో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీని భారీగా తరలివచ్చి విజయవంతం చేసిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
Khammam: ఖమ్మం జిల్లా కార్యకర్తలు చూపిన చొరవ, క్రమశిక్షణ అభినందనీయం!
Khammam: నిన్న హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీని ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు శాసనసభ సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్, మట్టా రాగమయి దయానంద్ , కోరం కనకయ్య ఆదేశాల మేరకు ఆయా నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు హైదరాబాద్ తరలి వెళ్లి ర్యాలీని జయప్రదం చేయుటకు సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్.
రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ఉద్యమంలో ఖమ్మం జిల్లా కార్యకర్తలు చూపిన చొరవ, క్రమశిక్షణ అభినందనీయమని ఆయన కొనియాడారు. ర్యాలీ విజయవంతానికి సహకరించిన ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు, మండల, గ్రామ స్థాయి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునేందుకు రాబోయే రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు.