Kothagudem: చంద్రబాబు కొత్తగూడెం పర్యటన.. 108 అంబులెన్స్‌ను తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ!
Kothagudem: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కొత్తగూడెం పర్యటన నేపథ్యంలో కేటాయించిన 108 అంబులెన్స్‌ను డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారామ్ రాథోడ్ గురువారం తనిఖీ చేశారు.
Kothagudem: చంద్రబాబు కొత్తగూడెం పర్యటన.. 108 అంబులెన్స్‌ను తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ!
Kothagudem: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్తగూడెం పర్యటనకు విచ్చేస్తున్న నేపథ్యంలో, పర్యటన సందర్భంగా వైద్య అత్యవసర సేవలను అందించేందుకు ప్రత్యేకంగా కేటాయించిన 108 అంబులెన్స్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ గారు ఈరోజు స్వయంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అంబులెన్స్‌లో అందుబాటులో ఉన్న అత్యవసర వైద్య పరికరాలు, ప్రథమ చికిత్స సామగ్రి, అవసరమైన మందులు, ఆక్సిజన్ సదుపాయం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అంబులెన్స్‌లో అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
ముఖ్యమంత్రి పర్యటన సమయంలో ఎటువంటి వైద్య అత్యవసర పరిస్థితి ఎదురైనా తక్షణమే స్పందించి, అవసరమైన వైద్య సేవలు అందించేందుకు అంబులెన్స్ సిబ్బంది పూర్తి అప్రమత్తతతో, సమన్వయంతో విధులు నిర్వహించాలని DMHO ఆదేశించారు.
ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మరియు పర్యటనలో పాల్గొనే వారికి అత్యవసర వైద్య సేవలు అందించడంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.