Sircilla: రైతులతో సమన్వయంగా ఉండాలి సిరిసిల్ల విద్యుత్ అధికారులకు ఎస్‌ఈ!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను TGNPDCL ఎస్‌ఈ వేణుమాధవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు
Sircilla: రైతులతో సమన్వయంగా ఉండాలి సిరిసిల్ల విద్యుత్ అధికారులకు ఎస్‌ఈ!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు విద్యుత్ సరఫరాపై TGNPDCL అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట సబ్‌స్టేషన్‌ను TGNPDCL ఎస్‌ఈ వేణుమాధవ్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.అల్మాస్పూర్ గ్రామ రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులతో సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
అల్మాస్పూర్ గ్రామంలో లూజ్‌గా ఉన్న విద్యుత్ లైన్లను సరిచేసే పనులు కొనసాగుతున్నాయని, విద్యుత్ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని ఎస్‌ఈ వేణుమాధవ్ స్పష్టం చేశారు.