Karimnagar: యువకుడిని రోడ్డుపై చితకబాదిన ఆర్‌ఐ, ఆర్‌ఎస్‌ఐలు!

Karimnagar: కరీంనగర్ లో కలకలం రేగింది. బైక్ పార్కింగ్ వివాదంలో సివిల్ డ్రెస్‌లో ఉన్న పీటీసీ ఆర్‌ఐ రమేష్, ఆర్‌ఎస్‌ఐలు ఒక యువకుడిని రోడ్డుపై లాగి చితకబాదారు.

Update: 2026-06-23 10:59 GMT

Karimnagar: యువకుడిని రోడ్డుపై చితకబాదిన ఆర్‌ఐ, ఆర్‌ఎస్‌ఐలు!

కరీంనగర్: కరీంనగర్ రాంనగర్ ప్రాంతంలో బైక్ అడ్డంగా పెట్టడంపై మొదలైన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సివిల్ డ్రెస్‌లో ఉన్న పీటీసీ ఆర్ఐ రమేష్, ఆర్‌ఎస్‌ఐలు దత్తు, పరశురాంలతో ఓ యువకుడు వాగ్వాదానికి దిగి, కర్రతో దాడికి యత్నించాడు. తాము పోలీసులమని చెప్పడంతో భయాందోళనకు గురైన ఆ యువకుడు సమీపంలోని ఓ ఇంట్లోకి దూరి దాక్కున్నాడు.

అగ్రహించిన అధికారులు సదరు యువకుడిని ఇంటి బయటకు లాగి రోడ్డుపై చితకబాదారు. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వైరల్ అయ్యాయి. ఆర్‌ఎస్‌ఐ ఫిర్యాదు మేరకు టూటౌన్ సీఐ కె. సృజన్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉన్నతాధికారులు సైతం ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News