Sultanabad: సుల్తానాబాద్‌లో టీ దుకాణాలపై పోలీసుల ఆకస్మిక దాడి
Sultanabad: సుల్తానాబాద్ ఎస్ఐ చంద్రకుమార్ టీ షాపుల్లోని స్మోకింగ్ జోన్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.
Sultanabad: సుల్తానాబాద్‌లో టీ దుకాణాలపై పోలీసుల ఆకస్మిక దాడి
Sultanabad: టీ షాపులలో సిగరెట్లు తాగడానికి ప్రత్యేకంగా గదులను కేటాయించవద్దని ఎస్సై చంద్రకుమార్ టి షాపుల యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సుల్తానాబాద్ మండల కేంద్రంలో పలు టీ షాపులలో స్మోకింగ్ జోన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. . యువత చెడు మార్గాలకు దారి తీసే విధంగా సిగరెట్లు పీలుస్తున్నారని తద్వారా యువత ఆరోగ్యం చెడిపోతుందని మత్తుకు బానిసలై చెడు మార్గాలకు దారి తీసే విధంగా ఉన్నటువంటి స్మోకింగ్ రూమ్ లను ఎత్తివేయాలని ఆదేశించారు.
ఇకనుండి తరచూ దాడులు నిర్వహిస్తామని ఎట్టి పరిస్థితుల్లో సపరేట్ గదులు ఏర్పాటు చేసి సిగరెట్లు విక్రయిస్తే ఉపేక్షించేది లేదని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం సిగరెట్లు పీల్చుతున్న యువతకు కౌన్సెలింగ్ నిర్వహించారు. యువత చక్కగా చదువుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వెయ్యాలే తప్ప ఇలాంటి సిగరెట్ , మత్తు పదార్థాలు ఇతర వ్యసనాలకు బానిసలు కావద్దని సూచించారు. ఈ తనిఖీలలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.