Sircilla: 'విశ్వహిత శతకం' పుస్తకాన్ని ఆవిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రముఖ కవి వెంగళ లక్ష్మణ్ రచించిన 'విశ్వహిత శతకం' పుస్తకాన్ని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ఆవిష్కరించారు.
Sircilla: 'విశ్వహిత శతకం' పుస్తకాన్ని ఆవిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో ప్రముఖ కవి వెంగళ లక్ష్మణ్ రచించిన ‘విశ్వహిత శతకం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాహిత్యం సమాజానికి సరైన మార్గదర్శకత్వం చేస్తుందని, కవులు, రచయితలు తమ రచనల ద్వారా సామాజిక చైతన్యాన్ని, నైతిక విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. ప్రముఖ కవి వెంగళ లక్ష్మణ్ రచించిన ‘విశ్వహిత శతకం’ ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ సమాజానికి మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. తెలుగు సాహిత్య అభివృద్ధికి కృషి చేస్తున్న జిల్లా సాహితీ సమితి అధ్యక్షులు, సభ్యులతో పాటు పుస్తక రచయితను అభినందించారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల సాహితీ సమితి అధ్యక్షులు జనాపాల శంకరయ్య, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత నలిమేళ భాస్కర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ అడిచర్ల సాయికృష్ణ, ప్రముఖ కవులు, రచయితలు జూకంటి జగన్నాథం, రాచర్ల రఘురామ శర్మ, జూపల్లి మోహనరావు, గడ్డం పరశురాములు, గూడూరి బాలరాజు, కోడం నారాయణ, బుగ్గ రాజేశ్వర్, చేపూరి బుచ్చయ్య, ఏనుగు ఎల్లయ్య, దొంత దేవదాసు, సబ్బానీ లక్ష్మీనారాయణ, నేరోజు రమేష్, వాసరవేణి పరశురాములు, బూర దేవానందం, ఆడెపు లక్ష్మణ్, సాయి మహేష్, శోభారాణి, మాడూరి అనిత, అంకారపు రవి, మొతుకుల నారాయణ, వంశీ, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.