Korutla: తప్పిపోయిన బాలుడిని సురక్షితంగా అప్పగించిన కోరుట్ల పోలీసులు!
Korutla: కోరుట్ల పట్టణంలో తప్పిపోయిన ఎనిమిదేళ్ల బాలుడు గుంటుక మహాన్ను పోలీసులు వెంటనే గుర్తించి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.
Korutla: తప్పిపోయిన బాలుడిని సురక్షితంగా అప్పగించిన కోరుట్ల పోలీసులు!
Korutla: కోరుట్ల పట్టణానికి చెందిన గుంటుక మహాన్ (8) అనే బాలుడు రాత్రి సమయంలో తప్పిపోగా, సమాచారం అందుకున్న పెట్రోలింగ్ ఇన్‌చార్జ్ వి. అశోక్, బ్లూకోల్ట్స్ సిబ్బంది గంగాధర్ వెంటనే గాలింపు చేపట్టారు. కొద్దిసేపట్లోనే బాలుడి ఆచూకీ గుర్తించి, సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
సమయస్ఫూర్తితో వ్యవహరించిన వీరిని మెట్‌పల్లి డీఎస్పీ రాములు, కోరుట్ల ఎస్సై శ్యామ్ రాజ్ అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.